Suryaa.co.in

Andhra Pradesh

1వ తేదీకి జీతాలు అందడం అనుమానమే

-బుధవారం మధ్యాహ్నంలోపు బిల్లులు అప్ లోడ్ అవుతాయా? లేదా? అని ఉద్యోగుల్లో సందేహం

అమరావతి: ఏపీ ఉద్యోగులకు డిసెంబర్ 1వ తేదీకి జీతాలు అందడం అనుమానంగానే ఉంది. సీఎఫ్‌ఎంఎస్‌  సర్వర్ డెడ్‌ స్లో కావడంతో జీతాల బిల్లులు ఇంకా అప్ లోడ్ కాలేదు. కావాలనే సర్వర్‌ను స్లో చేశారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిన్న (సోమవారం) మధ్యాహ్నం నుంచి సీఎఫ్‌ఎంఎస్‌ సర్వర్ డెడ్‌ స్లో కావడంతో డ్రాయింగ్ అండ్ డిస్పాస్‌మెంట్ ఆఫీసర్ల నుంచి జీతాల బిల్లు అప్ లోడ్ కావడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సబ్‌ట్రెజరీ కార్యాలయాల నుంచి జీతాల బిల్లులు ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం లోపు అప్‌లోడ్ చేయాల్సి ఉంది. బుధవారం మధ్యాహ్నంలోపు బిల్లులు అప్ లోడ్ అవుతాయా? లేదా? అనేది ఉద్యోగుల్లో సందేహం నెలకొంది. దీనికి టెక్నికల్ సమస్య అని ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ.. నిధుల కొరత వలనే ఈ విధంగా చేశారని ఉద్యోగ సంఘాలు అనుమానిస్తున్నాయి. కాగా జీతాలు, పెన్షన్ల కోసం ప్రతి నెల ప్రభుత్వానికి రూ. 5,500 కోట్లు అవసరం.

LEAVE A RESPONSE