– టీడీపీ నాయకులం ఏదైతే చెప్పామో అదే ఇప్పుడు కేంద్రం చెప్పింది
– ఆర్థిక శాఖ మంత్రి సిఏజి ఆడిట్ కి సిద్ధంగా ఉంటారా?
– టీడీపీ ఐదేళ్ల పాలనలో జమ, ఖర్చు లెక్కలు లేవని సర్టిఫికెట్ ఇవ్వగలరా?
– చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. . బుగ్గన చెప్పిన చోటికి నేను వస్తా
– కేంద్రం లెక్కలు అడిగే ధైర్యం రాష్ట్రంకు లేదు
– టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
దేశంలో పది రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే దిశగా సాగుతోందని కేంద్రం పార్లమెంటులో అన్ని పార్టీలకు సంబంధించిన నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరించడం బాధాకరం. నాలుగు నెలల క్రితం టీడీపీ నాయకులం మేము ఏదైతే చెప్పామో అదే ఇప్పుడు కేంద్రం చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి శ్రీలంక దిశగా సాగుతుందని, కేంద్రం కూడ చెప్పే పరిస్థితికి వచ్చింది. శ్రీలంక ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు అంచనా వేయడం కోసం కేంద్రం ఆర్థిక శాఖను, ఆర్బీఐ ని ఆదేశించడం జరిగింది.
వాళ్ళు రిస్క్ ఎనాలసిస్ ని తయారు చేస్తూ ఒక నివేదికను కేంద్రం ఆర్థిక శాఖకు పంపింది. ఆర్బిఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర ఆర్థిక శాఖ మరొక నివేదికని తయారు చేసింది. ఆ నివేదికలో శ్రీలంక ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తున్న రాష్ట్రాలు ఏవని గుర్తించింది. ఈ నివేదికని ప్రధానంగా ఇంటర్ నేషనల్ మానిటర్ ఫండ్ సూచనల మేరకు రిస్క్ ఎనాలసిస్ చేశారు. కేంద్రం ఒత్తిడితో, ప్రతి పక్ష పార్టీల ఒత్తిడితో చేసింది కాదు. వాళ్ళు ఇచ్చిన పది నివేదికలలో దాదాపు అన్నింటిలోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి రెండు స్థానాలు మారుతూ మొదటి స్థానంలోనే ఉంది. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత తీవ్రంగా సంక్షోభం దిశగా వెళుతోందనే దానికి ఉదాహరణ ఈ నివేదికే.
రుణ పరిమితి దాటింది, ఇన్ ఫ్లేషన్ రేటు అధికంగా ఉంది, ఆదాయానికి అప్పులకి ఉన్న పరిమితికి ఎక్కడా సమతుల్యత లేదు. మన రాష్ట్రంలో దాదాపు 50వేల కోట్ల రూపాయల అప్పులకు సంబంధించిన అకౌంటు వివరాలు పంపించలేదు. దాచిన లెక్కలని బయటకు తీయాల్సిన బాధ్యత సి.ఏ.జీలకు ఉంది. వాళ్ళు గత సంవత్సరం సంతకం పెట్టేటపుడు దేశంలోనే ఏ రాష్ట్రానికి ఇవ్వని క్వాలిఫైడ్ సర్టిఫికెట్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారు. ఈ సంవత్సరం కూడ అకౌంటుకి సంబంధించి సంతకం పెట్టడం జరిగింది. ఆడిట్ ఆఫీసర్లు మాకు అందిన సమాచారం ఇది, మాకు అందని సమాచారం ఎంతో ఉందని ఎక్కడో చిన్న అక్షరాలలో రాశారు. దాని వల్ల ఉపయోగంలేదు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై లోతైన అధ్యయనం జరగాలి. శ్రీలంక అప్పులతోటి కుప్ప కూలి పోయిందంటే శ్రీలంక కంటే ఆంధ్రప్రదేశ్ 4రెట్లు ఎక్కువ అప్పు చేసింది. కనుక సంక్షోభం దిశగా వెళ్లాము. శ్రీలంక సంక్షోభంలో ఉంటే ఇబ్బంది పడుతున్నది రాజ పక్ష కుటుంబం, గొటబాయ కుటుంబం, పాలకులు కాదు అక్కడ ఉన్న సామాన్య ప్రజలు. పారిపోయిన విజయమాల్య, గొటబాయ కుటుంబంలాగా ఆర్థిక సంక్షోభం వస్తే ఈ పాలకులు ఏటో పారిపోతారు. పారిపోయిన వారికెవ్వరికి నష్టం జరగదు. రాష్ట్రంలో ఉన్న సామాన్యులు కష్టాలు అనుభవించే పరిస్థితి వస్తుంది.
అప్పు చేయడం తప్పు కాదు, అప్పుని సక్రమంగా వినియోగించక పోవడం తప్పు. సంక్షేమం కోసమే అప్పు అని చెప్తున్న జగన్ మాటలు బూటకం. సంక్షేమం ముసుగులో వైసీపీ చేస్తున్న ఆర్థిక అరాచకం చాలా ఉంది. అనంతపురం జిల్లాలో జిల్లేడు బండ అనే రిజర్వాయర్ కి గత ప్రభుత్వం టెండరు వేస్తే ఉన్న విలువ అదే సామర్ధ్యం ఉన్న అదే రిజర్వాయర్ కి జగన్ రెడ్డి ప్రభుత్వం టెండరు వేస్తే 400 కోట్లు అయింది. ఆ డబ్బు ఏ సామాన్యుడికి అందింది. సంక్షేమం కోసం అప్పులా స్వార్థం కోసం అప్పులా? అసలు సంక్షేమ పథకాలకి రూపకల్పన చేసింది నందమూరి తారక రామారావు, తెలుగుదేశం పార్టీ. సంక్షేమం పేరుతో జగన్ చేస్తున్న దోపిడీకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం.
ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో ఎక్కడైన ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు చేశారు?. ఆర్.డబ్లూ స్కీమ్ ఏ జిల్లాలో అయిన చేపట్ట గలిగారా? కనీసం ట్యాంకులని కడిగించగలిగారా? 6వేల రూపాయలు ఇచ్చేస్తే రైతు సాయం అయిపోతుందా?. డ్రిప్ ఇచ్చారా?, సబ్సీడీ మీద లోన్ ఇచ్చారా? ఏం ఇవ్వకుండా దాదాపు వ్యవసాయశాఖను మూసేసే దిశగా తీసుకెళ్ళారు. ఎవరికి ఎటువంటి ఆర్థిక సాయం చేయకుండా తెస్తున్న వేల కోట్లు అప్పులు ఎక్కడకి పోతున్నాయి? రాబోయే రోజులలో ఇరిగేషన్ లో 15వేల కోట్లు, ఎలక్ట్రీసిటీ డిపార్టుమెంటులో 6వేల కోట్లు అంచనాలకు మించి లెక్కలు వేయడానికి సిద్ధపడ్డారు. సి.ఏ.జి కి ఎందుకు లెక్కలు చూపించలేక పోతోంది ప్రభుత్వం?
డిస్కామ్ లకు 10వేల కోట్ల అప్పులు, కాంట్రాక్టర్లకు 97వేల కోట్ల పై చిలుకు అప్పులు, పిడి ఖాతాల ముసుగులో చేసిన మోసాలని సాక్షాత్తు సుప్రీం కోర్టు బయటకు తీసుకొచ్చింది. కరోనా ఎమర్జెన్సీ కోసం నిధులు మంజూరు చేస్తే దాన్ని పీడి ఖాతాలకు మళ్ళించి ఇతర అవసరాలకు వాడుకున్నందుకు కూడ చీవాట్లు పెట్టింది న్యాయ స్థానం. రాష్ట్రంలో కొన్ని లక్షల పిడి ఎకౌంటులు ఉంటే అందులో కొన్ని వేల అకౌంటులు యాక్టివ్ గా ఉన్నాయి. కొన్ని వందల అకౌంటుల నుంచి ఇటువంటి డైవర్షన్ జరిగింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సిఏజి ఆడిట్ కి సిద్ధంగా ఉంటారా.
జగన్ రెడ్డికి సంబంధించిన వ్యవస్థలు లాభాల దిశగా సాగుతున్నాయి, అప్పులు చేస్తే తీర్చేయగలుగుతున్నారు, ఆదాయాన్ని 10రెట్లు పెంచుకోగలుగుతున్నారు. రాష్ట్రానికి మాత్రం ఆదాయం పడిపోతుంది, అప్పులలో కూరుకుపోతుంది. ఆర్థిక సంక్షోభం వస్తే పాలకులు పారిపోతారు, వ్యాపారం చేసుకొని డబ్బు సంపాదించిన, దోచుకున్న వ్యాపారవేత్తలు పారిపోతారు. కానీ రాష్ట్రంలో మిగిలిపోయేది సామాన్యుడు మాత్రమే. శ్రీలంక సామాన్య ప్రజలు లాగానే మన రాష్ట్ర ప్రజలు కూడ ఇబ్బంది పడే రోజులు మును ముందు వస్తాయి.అకౌంట్స్ పంపాలి, పరిశీలించిన తరువాత పీఏసీకి పెడతారు. పీఎసీ కమిటీకి పెడతారు. కమిటి సంతృప్తి చెందితే డ్రాప్ చేస్తుంది. లేకుంటే కంటిన్యూ చేస్తుంది.
టీడీపీ హయాంలో లెక్కలు దాచిన పరిస్థితులు లేవు. టీడీపీ ఐదేళ్ల పాలనలో జమ, ఖర్చు లెక్కలు లేవని సర్టిఫికెట్ ఇవ్వగలరా? ఆర్థికశాఖ కార్యదర్శికి అన్ని లెక్కలు చూపాము. పీఎజీ నుంచి కాగ్ కు వస్తాయి. కాగ్ అబ్జక్షన్ మాత్రమే నడుస్తోంది. పీఏజీ అకౌంట్స్ లోనే వైసీపీ ప్రభుత్వ అకౌంట్స్ పట్ల సంతృప్తి చెందలేదు. అసలు అకౌంట్సే సబ్ మిట్ చేయలేదు. పీఏసీకి మీటింగ్ లు జరపడానికి వాళ్ల సభ్యుల్ని సహకరించేలా చేయాలి. ఆరు నెలల్లో అప్ టు డేట్స్ అకౌంట్స్ చేసి పెడతాము. ఆర్థిక సంక్షోభం అనేది ఒక్క రోజులోనే కనబడుతుంది. సంకేతాలు ముందుగా కనబడతాయి. ఇంటర్నేషనల్ మానటరింగ్ ఫండ్ చూపించిన ప్రకారం ఆర్బీఐ సంకేతాలిచ్చింది. ప్రజల కోసం వాస్తవాలు బయట పెడుతున్నాం. అకౌంట్స్ ఆడిట్ చేయించాలి. ఎందుకు అకౌంట్స్ సబ్ మిట్ చేయించడంలేదు? ఎందుకు నిబంధనలు పాటించడంలేదు?
నేటి వరకు కాంట్రాక్టర్లకు చెల్లించిన, చెల్లించాల్సిన బాకాయిలు ఏమవుతున్నాయి? డిస్కాం లకు చెల్లించాల్సిన బాకాయిలు ఏమవుతున్నాయి? వ్యవసాయ రంగానికి, రైతులకు కేటాయించిన సొమ్ములో ఎంత ఖర్చు పెట్టారు? ఎంత ఖర్చు పెట్టాల్సివుంది? నీటి పారుదల ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేశారు? వివరాలు బయటపెట్టాలి. చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పిన చోటికి నేను వస్తాను. నాకెలాంటి అభ్యంతరం లేదు. బుగ్గన కరెక్టు చేసివుంటే కరెక్టే అని చెబుతాను. పార్టీ పట్ల అభిమానం కన్నా ప్రజలకు జవాబుదారీగా ఉంటాను. బుగ్గన రాజేంద్రనాధ్ సిద్ధమా సమాధానం చెప్పాలి. . నా దృష్టికి వచ్చిన లోపాలను నేను ఎత్తి చూపుతాను. కాదని నిరూపిస్తే నేను అంగీకరిస్తాను.
పీఏజీ సర్టిఫికెట్ వైసీపీ ప్రభుత్వానికి ఇవ్వరు. ఏపీ శ్రీలంక లాగ కాకూడదని కేంద్రం అప్రమత్తం చేసింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పుడైనా సరిదిద్దుకోండి. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న రుణ పరిమితులు దాటిపోయాయి. అంచనాలు పెరిగాయి. కేంద్రానికి ఎంత స్వేచ్ఛ ఉందో రాష్ట్రానికి అంతే స్యేచ్ఛను రాజ్యాంగం ఇచ్చింది. ప్రభుత్వం, అధికారులు ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై లోతైన అధ్యయనం చేస్తే నిజాలు బయటికి వస్తాయి. నాలుగు నెలల క్రితం మేం చెప్పాం. సంవత్సరం క్రితం నేను సైరన్ మోగించాను. ఆరోజున నవ్వారు. అవహేళన చేశారు.
కేశవ్ అమాయకుడు కింద పడతాడు అని బుగ్గన ఆరోజు ప్రెస్ మీట్ లో చెప్పారు. ఎవరు పడుతున్నారో సంవత్సరం తరువాత ఇప్పుడు అర్థమవుతోంది. ఇప్పుడు కేంద్రం చెబుతోంది. కేంద్రం కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉన్నట్లు కనబడుతోంది. రాష్ట్రం పట్ల అభిమానమో, రాజకీయ కారణమో తెలియదు. కేంద్రం ఇప్పుడిప్పుడే అప్రమత్తమైంది. కేంద్రం రాష్ట్రానికి అప్రమత్తంగా ఉండండని చెప్పే ప్రయత్నం చేశారు. వింటారా? వినరా? అనేది రెండు మూడు నెలల్లో కనబడుతుంది. పార్లమెంటులో అనేక పార్టీలు దీనిపై చర్చిస్తాయి. శ్రీలంక అధ్యక్షుడు పారిపోయాడు, దేశంలో అప్పులు చేసిన పెద్దోళ్లు పారిపోయారు. సామాన్యుడు అప్పుల భారాన్ని మోస్తున్నాడు. శ్రీలంక పరిస్థితి మనకు రాకూడదు.
నాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లేశారు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మాట్లాడుతాను. ప్రతిపక్షంలో ఉన్నాం. పీఏసీ ఛైర్మన్ గా ఉన్నాను. పంజాబ్ కి కూడా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ఆ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల రాజకీయ రక్షణ ఉంది. పంజాబ్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా కేంద్రం పెద్ద చేయి అందిస్తుంది. రాష్ట్రానికి ఆ రక్షణ ఉంటుందా లేదా ఆలోచించాలి. అప్పులు చేసి అభివృద్ధి వైపు వెళ్లాలికానీ సంక్షోభం వైపు వెళ్లడమేంటి? అప్పులు సంక్షేమం కోసమే అనడం సబబుకాదు. ఇదంతా బూటకం. నాలుగింతలు అంచనాలు పెంచుతున్నారని నేనంటున్నాను. కాదు అని నిరూపించగలరా?
రాష్ట్రంలో అన్నీ గోప్యమే. ఒక్కటీ బహిర్గతంగా లేదు. సీఎం డ్యాష్ బోర్డులో అన్ని శాఖలను అప్ డేట్ చేయమని చెప్పాలి. అన్నీవెలుగులోకి వస్తాయి. సీఎం డ్యాష్ బోర్డులో కనబడదు. ముఖ్యమంత్రి అని గోప్యంగా తెప్పించుకొని చూసుకుంటారు. జగన్ ను పార్లమెంట్ లో నిలదీయమనాలి. కేసీఆర్ కేంద్రాన్ని నలిదీసినట్లు జగన్ నిలదీయగలడా? కేంద్రం అప్పు చేసి తప్పు చేస్తే కేసీఆర్ ప్రశ్నిస్తున్నాడు. మీరు ప్రశ్నించగలరా? కేంద్రం ఎక్కువ అప్పులు చేసివుంటే పార్లమెంటులో నిలదీయండి. స్పెషల్ స్టేటస్ తెస్తానని ముందు పులిలా గాండ్రించారు. ఇవాళ స్పెషల్ స్టేటస్ అడగలేని పరిస్థితులు ఉన్నాయి.
కేంద్రం లెక్కలు అడిగే ధైర్యం రాష్ట్రంకు లేదు. పీఏసీలో పాలకపక్షంవారే ఉన్నారు. నేనొక్కడినే ఉన్నాను. పీఏసీ సభ్యులుగా ఉన్న నలుగురు మంత్రులు అయ్యారు. ఒకరు చీఫ్ విప్ అయ్యారు. పీఏసీ యాక్టివ్ గా ఉంటే ప్రభుత్వానికి లాభం. సుప్రీం కోర్టు ముందు చేతులు కట్టుకొని దోషుల్లాగ కనబడుతున్నారు. కోవిడ్ కు ఇచ్చిన నిధుల్ని సైతం పీడీ అకౌంట్ల ద్వారా మళ్లించారు. వందల పీడీ అకౌంట్లలో ఈ విధమైన మళ్లింపులు జరిగాయి. నేను నిరూపించగలను. సాంప్రదాయాలు పాటిస్తే వ్యవస్థలు బలంగా ఉంటాయి. కావాల్సిన సమాచారం అడిగితే ప్రభుత్వం సహకరించడంలేదు. నాకు గన్ మెన్ లు ఇవ్వలేదు. సంచలనాలు పార్టీ దృష్టిలో ఉన్నాయి. పార్టీ అంగీకారం తర్వాత దేశంలో పది రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే దిశగా సాగుతుందని కేంద్రం నిన్న పార్లమెంటులో అన్ని పార్టీలకు సంబంధించిన నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరించడం జరిగింది.
నాలుగు క్రితం టీడీపీ నాయకులం మేము ఏదైతే చెప్పామో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి శ్రీలంక దిశగా సాగుతుందని, కేంద్రం కూడ చెప్పే పరిస్థితికి వచ్చింది. శ్రీలంక ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు అంచన వేయడం కోసం కేంద్రం ఆర్థిక శాఖను, ఆర్బీఐ ని ఆదేశించడం జరిగింది. వాళ్ళు రిస్క్ ఎనాలసిస్ ని తయారు చేస్తూ ఒక నివేదికని కేంద్రం ఆర్థిక శాఖకు పంపించడం జరిగింది. ఆర్బిఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర ఆర్థిక శాఖ మరియొక నివేదికని తయారు చేసింది. ఆ నివేదికలో శ్రీలంక ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తున్న రాష్ట్రాలు ఏవని గుర్తించింది.
ఈ నివేదికని ప్రధానంగా ఇంటర్ నేషనల్ మానిటర్ ఫండ్ సూచనల మేరకు రిస్క్ ఎనాలసిస్ చేశారు. కేంద్రం ఒత్తిడితో, ప్రతి పక్ష పార్టీల ఒత్తిడితో చేసింది కాదు. వాళ్ళు ఇచ్చిన పది నివేదికలలో దాదాపు అన్నింటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి రెండు స్థానాలు మారుతూ మొదటి స్థానంలోనే ఉంది. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత తీవ్ర స్థాయి సంక్షోభం దిశగా వెలుతుందనే దానికి ఉదాహరణ ఈ నివేదికే. రుణ పరిమితి దాటింది, ఇన్ ఫ్లేషన్ రేటు అధికంగా ఉంది, ఆదాయానికి అప్పులకి ఉన్న పరిమితికి ఎక్కడ సమతుల్యత లేదు.
దాదాపు మన రాష్ట్రంలో దాదాపు 50వేల కోట్ల రూపాయల అప్పులకు సంబంధించిన అకౌంటు వివరాలు పంపించలేదు. దాచిన లెక్కలని బయటకు తీయాల్సిన బాధ్యత సి.ఐ.జెలకు ఉంది. వాళ్ళు గత సంవత్సరం సంతకం పెట్టేటపుడు దేశంలోనే ఏ రాష్ట్రానికి ఇవ్వనటువంటి క్వాలిఫైడ్ సర్టిఫికెట్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారు. ఈ సంవత్సరం కూడ అకౌంటుకి సంబంధించి సంతకం పెట్టడం జరిగింది. ఆడిట్ ఆఫీసర్లు మాకు అందిన సమాచారం ఇది, మాకు అందని సమాచారం ఎంతో ఉందని ఎక్కడో చిన్న అక్షరాలలో పెడతున్నారు. దాని వల్ల ఉపయోగంలేదు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై లోతైన అధ్యయనం జరగాలి. శ్రీలంక అప్పులతోటి కుప్ప కూలి పోయిందంటే శ్రీలంక కంటే ఆంధ్రప్రదేశ్ 4రెట్లు ఎక్కువ అప్పు చేసింది కనుక సంక్షోభం దిశగా వెల్లమా. శ్రీలంక సంక్షోభంలో ఉంటే ఇబ్బంది పడుతుంది రాజ పక్ష కుటుంబం, గొటబాయ కుటుంబం, పాలకులు కాదు అక్కడ ఉన్న సామాన్య ప్రజలు. పారిపోయిన విజయమాల్య, గొటబాయ కుటుంబంలాగా ఆర్థిక సంక్షోభం వస్తే ఈ పాలకులు ఏటో పారిపోతారు. పారిపోయిన వారికెవ్వరికి నష్టం జరగదు. రాష్ట్రంలో ఉన్న సామాన్యులు కష్టాలు అనుభవించే పరిస్థితి వస్తుంది. అప్పు చేయడం తప్పు కాదు, అప్పుని సంక్రమంగా వినియోగించక పోవడం తప్పు. సంక్షేమం కోసమే అప్పు అని చెప్తున్న జగన్ మాటలు బూటకం.
సంక్షేమం ముసుగులో వైసీపీ చేస్తున్న ఆర్థిక అరాచకం చాలా ఉంది. అనంతపురం జిల్లాలో జిల్లేడు బండ అనే రిజర్వాయర్ కి గత ప్రభుత్వం టెండరు వేస్తే …….27.36- 94 కోట్లు వచ్చింది. అదే సామర్ధ్యం ఉన్న అదే రిజర్వాయర్ కి జగన్ రెడ్డి ప్రభుత్వం టెండరు వేస్తే 400 కోట్లు. ఆ డబ్బు ఏ సామాన్యుడికి అందింది. సంక్షేమం కోసం అప్పులా స్వార్థం కోసం అప్పులా? అసలు సంక్షేమ పథకాలకి రూపకల్పన చేసింది నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ. సంక్షేమం పేరుతో జగన్ చేస్తున్న దోపిడీకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం.
ఉత్తరాంధ్రలో, కోస్తాంధ్రలో, రాయలసీమలో ఎక్కడైన ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు చేశారు. ఆర్.డబ్లూ స్కీమ్ ఏ జిల్లాలో అయిన చేపట్ట గలగారా. కనీసం ట్యాంకులని కడిగించగలిగారా. ఒక 6వేల రూపాయలు ఇచ్చేస్తే రైతు సాయం అయిపోతుందా. డ్రిప్ ఇచ్చారా, సబ్సీడీ మీద లోన్ ఇచ్చారా ఏం ఇవ్వకుండా దాదాపు వ్యవసాయశాఖను మూసేసే దిశగా తీసుకెళ్ళారు. ఎవరికి ఎటువంటి ఆర్థిక సాయం చేయకుండా వేల కోట్లు అప్పులు ఎక్కడకి పోతున్నాయి. రాబోయే రోజులలో ఇరిగేషన్ లో 15వేల కోట్లు, ఎలక్ట్రీసిటీ డిపార్టుమెంటులో 6వేల కోట్లు అంచనాలకు మించి లెక్కలు వేయడానికి సిద్ధపడ్డారు.
సి.ఐ.జి కి ఎందుకు లెక్కలు చూపించలేక పోతుంది ప్రభుత్వం. డిస్కామ్ లకు 10వేల కోట్ల అప్పులు, కాంట్రాక్టర్లకు 97వేల కోట్ల పై చిలుకు అప్పులు, పిడి ఖాతాల ముసుగులో చేసిన మోసాలని సాక్షాత్తు సుప్రీం కోర్టు బయటకు తీసుకొచ్చింది. కరోనా ఎమర్జెన్సీ కోసం నిధులు మంజూరు చేస్తే దాన్ని పీడి ఖాతాలలో మళ్ళించి ఇతర అవసరాలకు వాడుకున్నందుకు కూడ చీవాట్లు పెట్టింది న్యాయ స్థానం. రాష్ట్రంలో కొన్ని లక్షల పిడి ఎకౌంటులు ఉంటే అందులో కొన్ని వేల అకౌంటులు యాక్టివ్ గా ఉన్నాయి. కొన్ని వందల అకౌంటుల నుంచి ఇటువంటి డైవర్షన్ జరిగింది.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సిఐజి ఆడిట్ కి సిద్ధంగా ఉంటారా. జగన్ రెడ్డికి సంబంధించిన వ్యవస్థలు లాభాల దిశగా సాగుతున్నాయి, అప్పులు చేస్తే తీర్చేయగలుగుతున్నారు, ఆదాయాన్ని 10రెట్లు పెంచుకోగలుగుతున్నారు. రాష్ట్రానికి మాత్రం ఆదాయం పడిపోతుంది, అప్పులలో కూరుకుపోతుంది. ఆర్థిక సంక్షోభం వస్తే పాలకులు పారిపోతారు, వ్యాపారం చేసుకొని డబ్బు సంపాదించిన, దోచుకున్న వ్యాపారవేత్తలు పారిపోతారు. కాని రాష్ట్రంలో మిగిలిపోయేది సామాన్యుడు మాత్రమే. శ్రీలంక సామాన్య ప్రజలు లాగానే మన రాష్ట్ర ప్రజలు కూడ ఇబ్బంది పడే రోజులు మును ముందు వస్తాయి. ప్రజల ముందుకు తెస్తామని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విలేఖరుల సమావేశంలో వివరించారు.