ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి సత్యనారాయణకు రాష్ట్ర హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. విద్యా శాఖకు సంబంధించిన బిల్లుల విడుదలలో జాప్యం చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ విచారణకు సత్యనారాయణ హాజరు కావాల్సి ఉన్నా… ఆయన గైర్హాజరయ్యారు. దీంతో ఆయనపై హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
విద్యా శాఖకు చెందిన బిల్లుల చెల్లింపులో ఆర్థిక శాఖ తీవ్ర జాప్యం చేస్తోందంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆధ్వర్యంలోని ఏకసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ విచారణకు ఆర్థిక శాఖ నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎస్ఎస్ రావత్, రాజశేఖర్, సురేశ్ కుమార్లు హాజరయ్యారు. అయితే సత్యనారాయణ మాత్రం విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.