Suryaa.co.in

Andhra Pradesh

70 రోజులకు చేరుకున్న ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం

-కొనసాగుతున్న ప్రజాప్రతినిధులకు “ఉద్యోగుల ఆవేధన చెపుదాం” కార్యక్రమం
-ప్రధానమైన ఆర్ధిక/ఆర్ధికేతర సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఉద్యమం ఆగదు
-తదుపరి మూడవ ప్రాంతీయ సదస్సు ను ఏలూరు లో ఈ నెల 27వ తేదీ నిర్వహిస్తాం

ఏపీ లో ఉద్యోగ,ఉపాధ్యయ,కార్మిక, రిటైర్డు,కాంట్రాక్టు & ఔట్ సోర్శింగు ఉద్యోగులె న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కొరకు అందరి మద్దతు కూడగట్టేందుకు, మా “ఉద్యోగుల ఆవేదనను చెబుదాం” కార్యక్రమం ద్వారా ప్రధానంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న 175 మంది ఎమ్మెల్యే లు, 25 మంది ఎంపీ లు లను కలిసే కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుందని, ఇప్పటికే దాదాపు యాభై శాతం కంటే ఎక్కువ మందినీ ఆయా జిల్లాల నాయకత్వం కలవడం పూర్తి అయ్యింది అని ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,సెక్రటరీజెనరల్ పలిశెట్టి దామోదరరావు,అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు, కోశాధికారి వి.వి. మురళీకృష్టనాయుడు గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

నేటికి మా ఉద్యమం ప్రారంబించి 70 రోజులు అయింది. అయినప్పటికి ప్రభుత్వం నుండి ఉద్యోగుల న్యాయమైన ప్రధాన డిమాండ్లు పరిష్కారం పై ఎప్పుడు, ఎలా చేస్తారో, అసలు చేస్తారో చేయరో, చేయగలరో లేదో చెప్పల్సిన అవసరం ఎంతైనా సరే ఈప్రభుత్వానికి ఉందని బావిస్తున్నాం.

ఏపి లో ఉన్న 13 లక్షల మంది ఉద్యోగుల గుండెచప్ఫుడును ఎమ్మెల్యే/ఎంపీ లు అర్దం చేసుకొని ఉద్యోగులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వంపై తప్పకుండా ఒత్తిడి తెచ్చి మాకు న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే ఈవిదంగా ప్రజాప్రతినిధులను కలిసేకార్యక్రమన్ని కొనసాగిస్తున్నామని బొప్పరాజు & పలిశెట్టి తెలిపారు.

ప్రాంతీయ సదస్సు:
ఇప్పటికే శ్రీకాకుళం మరియు అనంతపురం ప్రాంతీయ సదస్సులు ద్వారా క్రింది స్థాయిలో ఉన్న ప్రతి ఉద్యోగికి వాస్తవాలు తెలుపుతూ విజయవంతంగా నిర్వహించామని, తదుపరి మూడవ ప్రాంతీయ సదస్సు ను ఏలూరు లో ఈ నెల 27వ తేదీ నిర్వహిస్తామని తెలిపారు.

LEAVE A RESPONSE