Suryaa.co.in

Political News

ఓడిన ఏపీని గెలిపించాలి

రెండు చేతులతో ఓట్లు వేసి గెలిపించు కున్నాం అని మురిసిపోయారు… సంబరపడ్డారు .!
కానీ తామే ఓడిపోయారు .! ఆంధ్ర రాష్ట్రాన్ని ఓడించారు .! గెలుపులో సింహ భాగం పాత్ర వహించారు .! ప్రభుత్వము అధికారం లో కి రాగానే పాలాభిషేకాలు చేశారు .!
మేము తల్చుకుంటే ప్రభుత్వాన్ని నిల బెట్టగలం ..పడగొట్ట గలం అని బింకాలు ,బీరాలు పోయారు .!
అవినీతి రారాజు కి ,నేర చరిత్ర కలిగి జైలు జీవితం గడిపిన వాడికి పట్టం కట్టారు .!
విజ్ఞత , ఆలోచించే జ్ఞానం కలిగి ఉండి ఏ మాత్రం తార్కిక జ్ఞానం , ఆలోచనా శక్తి లేని జంతువులు అడవిలో వేటగాడు వేసే ఎ ర లకి ఆకర్షించ బడి ఎలా ఉచ్చులో చిక్కుకొని బలి అవుతాయో … అలా జగన్ రెడ్డి వేసిన రకరకాలు ఎర లకి ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు పరవశించి పోయి ఓట్లు వేసి అతని ఉచ్చులో కి రాష్ట్రాన్ని నెట్టివేసారు .!
ఒక బల హీనుడిని నిర్ణయా త్మకంగా వ్యవహరించ లేని వాడిని ఆంధ్రా ప్రజలు ఎన్నుకున్నారు .!
అధికారం అప్పచెప్పి బలవంతుడి నీ చేశారు .!
ఫలితం ఆంధ్ర ప్రదేశ్ ఆసాంతం నిర్వీర్యం అయిపోయింది .!
అభివృద్ధి అనేది మచ్చుకైనా లేదు .!
దోచుకున్న వారికి దోచుకు న్నంత .!
ఎక్కడ చూసినా అంతే లేని అరాచకం, దౌర్జన్యం .!
ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, లాకప్ హింసలు.!
అది సొంత పార్టీ ఎంపీ అయినా..సామాన్య ప్రజానీకం అయినా!
రక్షించాల్సిన రక్షక వ్యవస్థ..భక్షక వ్యవస్థ అయి కూర్చుంది..!
న్యాయ వ్యవస్థ అండ కాస్త ఊరట ..!
జనానికి జగన్మా య వదిలిపోయింది ..!
వొంటికి పట్టిన తిమ్మిర్లు దిగిపోయి నొప్పులు మొదలయ్యాయి .!
తాము చేసిన తప్పు తెలిసింది .!
కోరి తెచ్చుకున్న మొగుడు
కొరివై కూర్చున్నాడు .!
ఇచ్చిన హామీలు అన్ని తుంగ లో తొక్కేసాడు ..!
పాలన అస్తవ్యస్తం ..పైగా పన్నుల భారం .!
ప్రజల నుండి అధిక ధరలు, పన్నుల రూపంలో సొమ్ము లాగేస్తూ ..ఆ సొమ్మే పథకాల రూపంలో చిల్లరగా విసరటం దుర్మార్గం .!
తాము చేసిన తప్పు ఏమిటో ప్రజలకు తెలిసిపోయింది
ఫలితం .. వెల్లువెత్తుతున్న నిరసన .!
స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వస్తున్నారు ..తమ వ్యతిరేకత బయట వేస్తున్నారు .!
సగం పాలనకే అతని మీద సదభిప్రాయం పోయింది రాష్ట్ర ప్రజానీకానికి ..!
ప్రజల చేత ఎన్నుకోబడిన నేతల పాలనలా లేదు …ఒక నియంత పరిపాలన చేస్తున్నట్టు ఉంది .!
ప్రశ్నించే మేధావుల గొంతులు మూగ బోయాయి … కళ్లున్న గ్రుడ్డి వాళ్ళు అయ్యారు .!
రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో కి వెళ్ళిపోయింది …నాలుగు పక్కలా భద్రత అనేది లేదు …!
యదేచ్ఛగా నియమాల ఉల్లంఘన …!
ప్రభుత్వ అసమర్థత, అరాచక పాలన తో రాష్ట్రం దిగజారి పోయింది ..!
ప్రజలు విజ్ఞత లేకుండా తీసుకున్న నిర్ణయం …ఫలితం .!
అంధకారంలో ఆంధ్ర ప్రదేశ్ .!
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ..ప్రజలకి మంచి చేయాలంటే వారు స్వశక్తితో నిలబడేలా చేయూత నివ్వాలి ..!
సుభిక్షమైన పరిపాలన అందించాలి .!
అప్పుడే సుదీర్ఘ కాలం అధికారానికి అర్హులు అవుతారు .!
ప్రజాగ్రహానికి గురి అయిన ఏ నాయకుడు తిరిగి పట్టం కట్టించుకున్నట్లు చరిత్ర లో లేదు .!
కాస్త కూడా విజ్ఞత, ఆలోచన లేకుండా ప్రజలు తీసుకున్న తప్పుడు నిర్ణయానికి ఒక రాష్ట్రం అసమర్థుడి చేతిలోకి ఎలా వెళ్ళిపోయిందో ..
ఆంధ్ర ప్రదేశ్ ని ఉదాహరణ గా చూపించవచ్చు .!
ఏది ఏమైనా !ప్రజల్లో మార్పు రావాలి ..ఇంకా ఇంకా రావాలి .!
దెబ్బ కొట్టిన వాడిని తిరిగి దెబ్బ కొట్టాలి .. ఒక దెబ్బ కొట్టిన వాడిని పది దెబ్బలు కొట్టాలి ..!
లేకపోతే అది చేతకానితనం , బలహీనత అవుతుంది …!
ప్రజల్లో ఆవేశం తాత్కాలికం కాకూడదు ..!
వేసిన తప్పుటడుగును సరిదిద్దుకోవాలి.
ఓడి పోయిన ఆంధ్రప్రదేశ్ ను తిరిగి గెలిపించాలి.!

-చైతన్య

LEAVE A RESPONSE