Suryaa.co.in

Andhra Pradesh Telangana

హైదరాబాద్ లో భవనాలను కొనసాగించాలని తెలంగాణకు ఏపీ సర్కార్ విజ్ఞప్తి

రాష్ట్ర విభజన జరిగి జూన్ 2తో పదేళ్లు కావస్తుండడంతో ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్న ఏపీ భవనాలను స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తమకు కేటాయించిన భవనాలను మరికొంత కాలం కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కోరింది. దీనిపై సీఎం రేవంత్ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.

LEAVE A RESPONSE