Suryaa.co.in

Andhra Pradesh Sports

టేబుల్ టెన్నిస్ పోటీలలో రజత పతకం సాధించిన ఎ.పి సచివాలయ మహిళా ఉద్యోగులు

ఆగ్రా: ఉత్తర ప్రదేశ్ ఆగ్రా కంటోన్మెంట్ ఏకలవ్య స్పోర్ట్స్ స్టేడియంలో ఈ నెల 24 నుంచి 28 వ తేదీ వరకు నిర్వహించిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ 2021-22 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సచివాలయ మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

టేబుల్ టెన్నిస్ వుమెన్ వెటరన్ డబుల్స్ విభాగంలో బరిలోకి దిగిన ఏపీ సెక్రటేరియట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్స్ (సాధారణ పరిపాలన విభాగం, విభాగాధికారులు) ఎస్. సత్యవతి ఎం. బేబీ సరోజినీ ఛత్తీస్ఘడ్, మహారాష్ట్ర రాష్ట్రాల మీద గెలిచి ఫైనల్ లో రీజనల్ స్పోర్ట్స్ బోర్డ్ అహ్మదాబాద్ మహిళలతో ఆడి ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం సాధించారు.

ఈ పోటీలో పాల్గొన్న మహిళ లందరూ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారేనని, అటువంటి క్రీడాకారులతో పోటీలో పాల్గొని ద్వితీయ స్థానం పొందడం గర్వంగా ఉందని సత్యవతి, సరోజిని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ పోటీలలో పాల్గొనడానికి సహకారం అందించిన ముఖ్యమంత్రి , సచివాలయ అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A RESPONSE