-ఇక మెగా డిఎస్సీ కి అందరూ సన్నద్ధం కావాలని కోరుకుంటున్నాను
-విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
నిరుద్యోగ టీచర్లు గత మూడునెలలుగా ఎదురుచూస్తున్న ఎపి టెట్ ఫలితాలను ఈరోజు విడుదల చేశాను. టెట్ లో అర్హత సాధిస్తేనే డిఎస్సీ రాసేందుకు అర్హులు కావడం, డిఎస్సీలో టెట్ మార్కులకు 20శాతం వెయిటేజి ఉండటంతో ఈ ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2.35 లక్షలమంది నిరుద్యోగ టీచర్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. టెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు నా శుభాకాంక్షలు. మన ప్రజాప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సీ కి అందరూ సన్నద్ధం కావాలని కోరుకుంటున్నాను.
ఈ టెట్ లో క్వాలిఫై కాని అభ్యర్థులకు, కొత్తగా బిఈడి, డిఈడి పూర్తిచేసుకున్న వారికి అవకాశం కల్పిస్తూ త్వరలోనే టెట్ నిర్వహించబోతున్నాం. ఆ తరువాత మెగా డిఎస్సీ ఉండబోతుంది. ఈ లింక్ ద్వారా టెట్ రిజల్ట్స్ తెలుసుకోండి. https://cse.ap.gov.in