విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కాదు అప్పుల్లోనూ నెంబర్‌వన్‌గా నిలిచిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు.ఆదివారం మీడియాతో ఆమె మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజలపై అధిక భారాన్ని వైసీపీ సర్కార్ మోపిందని ఆరోపించారు. రాబోయే ఆదాయాన్ని చూపించి అప్పులు తెచ్చుకోవడం ఒక ఏపీలోనే ఉందని.. ఈ విషయంపై కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ కూడా ప్రశ్నించారని పురంధేశ్వరి అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితి చెప్పలేనంత దారుణంగా ఉన్నాయన్నారు. కేంద్రమంత్రి గడ్కరీ రోడ్లకు నిధులు ఇస్తే..రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గుప్పెడు మట్టి కూడా వేయలేదు విమర్శించింది. ఒక ఎంపీకి రక్షణ లేని పరిస్థితిలో ఏపీ ఉందని పురంధేశ్వరి ఎద్దేవ చేసింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ని పునాదులు నుంచి తీసుకెళ్లలేం కదా.. ఉద్యోగ, ఉత్పతి పెంచే దిశగా కేంద్రం ఆలోచిస్తుందన్నారు. స్టీల్‌ప్లాంట్ భూమిని అమ్మబోమని పురంధేశ్వరి స్పష్టం చేశారు.