Suryaa.co.in

Andhra Pradesh

పర్యావరణహిత పెట్టుబడుల వైపు ఆంధ్రప్రదేశ్ మలుపు

– వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వర్చువల్‌ సదస్సులో ఏపీఈడీబీ సీఈవో, ఏపీఐఐసీ వీసీ &ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది

26 వేల నుంచి 77వేల వాహనాల స్థాయికి కొనుగోళ్ళు విపరీతంగా పెరిగాయి.ప్రతి ఏడాది కాలుష్యం వలన 2 మిలియన్ల మంది చనిపోతున్నారు.దేశవ్యాప్తంగా 15 ముఖ్య పట్టణాల్లో 11 పట్టణాలు కాలుష్యంతో నిండాయి.ఎలక్ట్రిక్ వాహన రంగంవైపు మలుపు అంటే వాణిజ్యం పరంగా మాత్రమే కాదు.వాతావరణం, కాలుష్యం, ప్రజాక్షేమానికి తగ్గట్లు కూడా మలుపు అనివార్యం.

పారదర్శకతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత.పారిశ్రామికవేత్తల విశ్వాసం, సంతృప్తి వల్లే ఈవోడీబీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం.50 వేల అనుమతులను సింగిల్ విండో విధానంలో పూర్తి చేశాం. 99.3శాతం సంపూర్ణ పనితీరు ప్రదర్శించిన రాష్ట్రం ఏపీ మినహా మరొకటి లేదు.

ఆంధ్రప్రదేశ్ లో 21 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు రెడ్యుసింగ్ కాస్ట్ ఆఫ్ బిజినెస్ పై ఏపీ గురి.భూ కేటయింపులు సహా సకల మౌలిక సదుపాయాలు అందించడంలో ముందున్నాం.ఈవీ రంగానికి సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ల కొరత ఉంది.5 లక్షల కోట్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంతో భారతదేశం ముందుకెళుతోంది. కాలుష్యం వల్ల సంభవించే మరణాలు, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాలి(ఏడాదికి 20 లక్షలు)2 మిలియన్ల మరణాలను తగ్గించడమంటే 5శాతం వృద్ధిరేటు సాధించినట్లే.ఎలక్ట్రిక్ రంగంపై ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక శ్రద్ధ. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు, క్లస్టరింగ్ జోన్ల వంటి సదుపాయాల కల్పనకు పెద్దపీట.

LEAVE A RESPONSE