Suryaa.co.in

Andhra Pradesh

ఆకు రౌడీలకు, ఆర్ధిక నేరస్తులకు అడ్డాగా వైసీపీ

– మహిళల్ని వేధిస్తుంటే.. వైసీపీలోని మహిళలు ఏం చేస్తున్నారు
– మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఎందుకు బయటకు రావడం లేదు.?
– కుక్కలా గుడ్డలిప్పుకు తిరిగి.. ఒక సామాజిక వర్గంపై నిందలేయడం దుర్మార్గం
– తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ అధ్యక్షురాలు ఆచంట సునీత

బాధ్యతాయుతమైన పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ నీచమైన పని చేసిన గోరంట్ల మాధవ్ తక్షణమే రాజీనామా చేయాలి, మహిళను వేధించినందుకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ అధ్యక్షురాలు ఆచంట సునీత డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రవర్తించిన తీరు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది. వైసీపీ రాజకీయ పార్టీనా, రాసలీలల పార్టీనో అర్ధం కావడం లేదు. ఆకు రౌడీలకు, ఆర్థిక నేరగాళ్లకు అడ్డా అయిన వైసీపీని ఇంకా ప్రజలు భరించాల్సి రావడం సిగ్గుచేటు అన్నారు. పార్టీ అధ్యక్షుడు ఓ ఆర్ధిక నేరస్తుడు. వారి పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అంతకు మించి అన్నట్లు నేరాల్లో ఆరితేరుతున్నారు. గోరంట్ల మాధవ్ అనే వ్యక్తిపై రాజకీయాల్లోకి రాక ముందే మహిళల్ని లైంగికంగా వేధించిన కేసులు ఉన్నాయి. అలాంటి వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చినపుడే వైసీపీ ఎలాంటి పార్టీనో స్పష్టమైంది. ఒక నేరస్థుడిని ఎంపీని చేసి.. నేరస్తుల్ని ప్రోత్సహించడమే తమ నైజం అనేలా వైసీపీ వ్యవహరిస్తోంది.

ఒక ఎమ్మెల్యే అరగంట అంటాడు, ఇంకో ఎమ్మెల్యే గంట అంటాడు. మరొకడు వెనక నుండి వచ్చి పట్టుకుంటా అంటాడు. మరో వ్యక్తి ప్రజలు, అధికారుల ముందే మున్సిపల్ ఛైర్ పర్సన్ ను లైంగికంగా వేధిస్తాడు. అలాంటి వారికే పదవులు అనేలా జగన్ రెడ్డి మంత్రి పదవులు ఇచ్చారు. జోగి రమేష్ ఒక వాలంటీర్ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే అతన్ని మంత్రి చేశారు. అంబటి రాంబాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతే కనీసం చర్యలు తీసుకోకపోగా.. ఏకంగా సాగునీటి శాఖా మంత్రిని చేశారు. ఇలాంటి వారిని ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు.

గోరంట్ల మాధవ్ చేసిన పనికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు మహిళలు తలెత్తుకోలేకపోతున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతారనే ఉద్దేశ్యంతో చట్ట సభలకు పంపితే ఇలాంటి చట్ట విరుద్ధమైన పనులు చేయడానికి, గళమెత్తాల్సింది పోయి గలీజు పనులు చేస్తున్నందుకు సిగ్గు పడాలి. గోరంట్ల మాధవ్ చేసిన పనికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు చీపుర్లు పట్టుకుని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంత జరుగుతున్నా ఇంకా అతన్ని జగన్ రెడ్డి వారి గ్యాంగ్ వెనకేసుకుంటూ రావడం ద్వారా ఏం చెప్పదల్చుకున్నారు.?

25 మంది ఎంపీలను ఇస్తే.. ప్రత్యేక హోదా తెస్తా అని హోరెత్తించిన జగన్ రెడ్డి, ఇప్పుడు వారి పార్టీ నాయకులు చేస్తున్న గలీజు పనులపై సమాధానం చెప్పాలి. ఎంపీగా ఎన్నికైనప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజల కోసం ఎలాంటి పోరాటం చేసిన దాఖలాలు లేవు. కానీ.. ప్రజా సమస్యలపై పార్లమెంటులో పోరాటం చేసిన ఎంపీ రఘురామరాజుపై దాడి చేయబోయాడు. కియా పరిశ్రమ అధికారుల్ని బెదిరించడం, పార్లమెంటులోనే బూతులు మాట్లాడడం వంటి అత్యంత నీచమైన చరిత్ర మూటగట్టుకున్నాడు. అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబుల వేధింపులు, రాసలీలలు బయట పడినపుడే చర్యలు తీసుకుని ఉంటే.. గోరంట్ల మాధవ్ వరకు వచ్చేది కాదు.

పక్క రాష్ట్రంలో ప్రియాంక అనే యువతి హత్య జరిగితే.. దిశ తెచ్చాం. మహిళల్ని రక్షించేస్తామంటూ ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి.. గన్ కన్నా ముందే జగన్ వస్తాడని చెప్పిన రోజా, వాసిరెడ్డి పద్మ ఇప్పుడు ఎక్కడున్నారు.? మహిళల్ని అన్ని రకాలుగా అండగా ఉంటామన్న హోం మంత్రి తానేటి వనిత ఎక్కడున్నారు.? ఇలాంటి వ్యక్తులున్న పార్టీలో వైసీపీలోని మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలకైనా కనీసం భద్రత ఉందా అనే అనుమానం కలుగుతోంది.

వైసీపీలోని మహిళా నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి. జగన్ రెడ్డికి లేఖ రాయాలి. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దాదాపు వెయ్యి వరకు మహిళలపై నేరాలు నమోదయ్యాయి. ఏకంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలే ఇలా ఉంటే.. ఇంకా రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడ.?

గోరంట్ల మాధవ్ చేసిందే దగుల్బాజీ పని. ఆ వీడియో బయట పడితే.. దాన్ని తెలుగుదేశం పార్టీ వారు చేశారు, ఒక సామాజిక వర్గం వారు చేశారంటూ మీడియా సమావేశం పెట్టి మరీ ఉచ్ఛనీచాలు మరిచి మాట్లాడుతున్నాడు. జిమ్ లో వీడియోను మార్ఫింగ్ చేశారని కవర్ చేసుకోవడానికి ట్రై చేసి.. పక్కాగా బుక్కయ్యారు. గోరంట్ల మాధవ్ అనే ఒక కామ పిశాచి వీడియోలను మార్ఫింగ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందో అతనే ఆలోచించుకోవాలి. సన్నాసి పని చేసి.. పలానా సామాజిక వర్గం వారి కుట్ర అంటూ వ్యాఖ్యానించడం వారి కుల పిచ్చికి పరాకాష్ట. మిస్టర్ గోరంట్ల.. నీవు చేసిన పని చూసి కుల, మతాలకు అతీతంగా ప్రజలంతా నిన్ను ఛీదరించుకుంటున్నారు. నీవు తప్పు చేయలేదని నీ కుటుంబ సభ్యులు కూడా నమ్మడం లేదు.

ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించి నిజాలు నిగ్గు తేలుస్తా అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న.. గోరంట్లకు సవాల్ చేస్తున్నా. నీవు పంపిస్తావా లేక మమ్మల్ని పంపించమంటారా.? చేసిన తప్పుకు కనీసం పశ్చాత్తాపపడకుండా.. నిస్సిగ్గుగా విమర్శలు చేయడం, కులాల పేరుతో రాజకీయం చేయాలని అనుకోవడం గోరంట్ల, వైసీపీ నేతల దివాళాకోరు తనానికి నిదర్శనం.

జగన్ రెడ్డీ.. నీ పార్టీ నేతల తీరు, నీ నుండి వారికి అందుతున్న ప్రోత్సాహం చూసి.. కామాంధుల్ని, నేరస్తుల్ని ప్రోత్సహిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. తాడేపల్లి ప్యాలస్ కామాంధులకు షెల్టర్ గా మారిందనిపిస్తోంది. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా, ఇంత మంది మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులు చోటు చేసుకుంటున్నా.. మహిళా కమిషన్ ఎందుకు స్పందించడం లేదు. అసలు రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉందా అనే అనుమానం కలుగుతోంది. రాష్ట్రంలోని అరాచకాలపై ఇన్ని ఆధారాలు బయట పడుతున్నా, ఎంపీ మాధవ్ బాగోతం బట్టబయలైనా మహిళా కమిషన్ ఎందుకు స్పందించడం లేదు.? ఈ వ్యవహారంపై మంత్రి తానేటి వనిత, వాసిరెడ్డి పద్మ ఏం సమాధానం చెబుతారు.? ప్రాణం పోతే రూ.10 లక్షలు, మానం పోతే రూ.5 లక్షలు అనేలా వ్యవహరించకుండా.. రాష్ట్రంలో జగన్ రెడ్డి గ్యాంగ్ అరాచకాలకు బలైపోయిన మహిళలకు మహిళా కమిషన్ న్యాయం చేయాలి.

జగన్ రెడ్డి నోరు విప్పితే మహిళల్ని ఉద్దరించేస్తున్నా, అది చేస్తున్నా, ఇది ఇస్తున్నా అంటూ ప్రసంగాలు దంచుతున్నారు. ఈ రోజు ఇంత మంది మహిళలు జగన్ రెడ్డి ప్ర్రోత్సాహంతో వైసీపీ బ్యాచ్ చేతిలో దగాకు గురైతే ఏం చర్యలు తీసుకున్నారు.? ఎందుకు నోరు తెరవడం లేదు.? తల్లిని , చెల్లిని రాష్ట్రం నుండి తరిమేశారు. బాబాయి కూతురు తనకు తన అన్న పాలనలో రక్షణ లేదని ఏకంగా కోర్టుకు వెళ్లింది. జగన్ రెడ్డి మహిళలకు ఎంత దారుణంగా దగా చేస్తున్నాడో ఇంతకన్నా ఏం చెప్పాలి. జగన్ రెడ్డికి నిజంగా చిత్త శుద్ధి ఉంటే, మహిళా పక్షపాతి అనే మాటే నిజమైతే గోరంట్ల మాధవ్ సహా.. మహిళలపై నేరాల కేసుల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల్ని సస్పెండ్ చేయాలి. అలా కాకుండా.. ఇంకా రక్షిస్తూ పోతామంటే.. అలాంటి వారందరినీ చీపుర్లతో కొట్టి తరిమేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని గుర్తుంచుకోవాలి. ఊకదంపుడు ప్రసంగాలతో మోసం చేయడం మాని.. మహిళలకు న్యాయం చేయాలి.

LEAVE A RESPONSE