అమరావతి: ఏపీ ప్రభుత్వానికి ట్రెజరీ ఉద్యోగుల షాకిచ్చారు.వేతన బిల్లులను ప్రాసెస్ చేయమని ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి చేయడాన్ని ట్రెజరీ ఉద్యోగుల సంఘం నిరసిస్తోంది.ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావడంలో ఆంతర్యమేంటో చెప్పాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.తాము కూడా ఉద్యమంలో భాగమేనని ట్రెజరీ ఉద్యోగుల సంఘం స్పష్టం చేస్తోంది.
ప్రభుత్వం పెండింగ్ డీఏలు మంజూరు చేసి.. జీతం పెరిగినట్లు చూపిస్తున్నారని ట్రెజరీ ఉద్యోగుల సంఘం అభ్యంతరం తెలుపుతోంది.హెచ్‌ఆర్‌ఏ స్లాబులో కోత విధించడం అన్యాయమని ట్రెజరీ ఉద్యోగులు వాపోతున్నారు.పలు జిల్లాల్లో వేతన బిల్లులను ట్రెజరీ ఉద్యోగులు ప్రాసెస్ చేయలేదు.ఈనెల 25లోగా బిల్లులను ప్రాసెస్ చేయాలని ఆర్థికశాఖ ఆదేశించారు. అయితే ట్రెజరీ ఉద్యోగులు, డ్రాయింగ్ అధికారులు నిరాకరించారు.
మరోవైపు పీఆర్సీపై ఏకపక్ష జీవోలు జారీ చేసిన సర్కారుపై ‘సమ్మె అస్త్రం’ ప్రయోగించేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి.వేర్వేరు సంఘాలన్నీ ఉమ్మడిగా కలిసి వచ్చి… ఉద్యమించాలని నిర్ణయించుకున్నాయి.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ ప్రెస్‌మీట్ పెట్టి… ‘జీతం తగ్గదు. పెరుగుతుంది. మీరే సరిగా అర్థం చేసుకోలేదు’ అన్నట్లుగా మాట్లాడటంపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు.
‘న్యాయమైన పీఆర్సీయే లక్ష్యం’గా పోరాడాలని నిర్ణయించుకున్నారు. పీఆర్సీ రద్దు కోసం సమ్మెకు సైతం సిద్ధమని దాదాపు అన్ని సంఘాలు ప్రకటించాయి.ఉద్యోగుల ఉద్యమం కీలక మలుపు తిరుగుతోంది. పీఆర్సీ అనుబంధ సమస్యలపై కలిసి పనిచేద్దామని ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ పిలుపునిచ్చారు.సూర్యనారాయణ ప్రతిపాదనకు సచివాలయ ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి ఓకే చెప్పారు.ఇప్పటికే అన్ని సంఘాలు ఏకతాటిపైకి రావాలని కోరామని వెంకట్రామిరెడ్డి తెలిపారు.
ఇద్దరం కలిసి జేఏసీ నేతలు బొప్పరాజు, శ్రీనివాసరావులను కలుస్తామని, పీఆర్సీ సాధన సమితి పేరుతో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తామని సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి సంయుక్తంగా ప్రకటించారు.
ఉద్యోగులకి జీతాలు పెoచడo అవసరమా?
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గత మూడు నెలలలుగా ఇటు ప్రజలలో అటు ఉద్యోగులలో ప్రభుత్వంలో ఇదే చర్చ.prcలో జీతాలు పెంచడo ఇంతలా ఆలోచించి ,ఇంతలా చర్చలు చేసిన ప్రభుత్వం నభూతో నభవిష్యత్.ఇంత జరిగాక చివరికి దారుణంగా ఉద్యోగులు తిరిగి జీతాలు చెల్లించేలా Go ఇచ్చారు.అసలు ఉద్యోగులు ఏమి చేస్తున్నారు?వీళ్లకు జీతాలు పెంచడo అవసరం మా?సాధారణ ప్రజలు నుండి ప్రజాప్రతినిధులు వరకు చూద్దాం.
👉సాధారణ ప్రజలు ఉదయం లెగిస్తే మీ ఇంటి చెత్త పట్టుకెళ్లేది,మీ విధి లో చెత్త క్లీన్ చేసేది ఉద్యోగిస్తుడే(మున్సిపల్ కార్మికులు)
👉బయటకు వెళ్ళాలి అంటే బస్ ఎక్కితే ఉద్యోగుల తీసుకువెళ్లాలి(Rtc)
👉నీ ఇంటికి నిరంతరం కరెంట్ వస్తుంది అంటే ఉద్యోగులే(ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్)
👉నీ ఇంటికి నీరు వస్తుంది అంటే ఉద్యోగే కారణం(water డిపార్ట్మెంట్)
👉ని పొలం కి నీరు ఎరువు పంటకి బీమా పంటకు రేటు అన్ని ఉద్యోగుల పనిచేస్తే నే వస్తాయి
👉నువ్వు ప్రశాంతంగా నిద్ర పోవాలి అంటే ఉద్యోగే కారణం(పోలీస్)
👉నీకు చదువు రావాలి అంటే ఉద్యోగే కారణం(ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్)
👉ఆఖరి కి నువ్వు పుట్టిన (బర్త్ సర్టిఫికెట్)ఉద్యోగే కావాలి నువ్వు చచ్చిన(డేర్త్ సర్టిఫికెట్) ఉద్యోగే కావాలి(రెవెన్యూ)
👉నీకు ఏమి ఉన్నదో చెప్పాలి అంటే ఉద్యోగి ఇచ్చిన సర్టిఫికెట్ లే పట్టలే ఆధారo
👉ఇలా చెప్పుకుంటే పోతే ఉద్యోగులు చేసే పనులు ఎన్నో
👉చివరికి మీరు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు ఏ ఉద్యోగి లేకపోయినా అడుగుతియ్యగలరా?
👉ఒక్క పోలీసు లేకుండా బయటకి రాగలరా?ప్రతి సమాచారం ఉద్యోగుల నుండే ప్రభుత్వం కి అందాలి.
👉ఏ ముఖ్యమంత్రి ఏ మంత్రి మీ ఇంటికి వచ్చి చూడరు.మిమ్మలి చూసేది మీ పరిస్థితి చెప్పేది మీకు ప్రతి పథకo వచ్చేలా చేసేది ఉద్యోగులే
👉ఒక కలెక్టర్ నుండి ఒక చిరు ఉద్యోగి వరకు ప్రతి పనీ చేస్తేనే ప్రభుత్వం నడుస్తోంది పథకాలు నడుస్తున్నాయి. అంటే గాని ఏ ఒక్కరి వల్ల కాదు.
కాబట్టి సగటు ఉద్యోగి బాధ ఆంద్ర రాష్ట్రంలో ప్రజలు అర్ధం చేసుకుని ఇప్పటికి అయిన ఉద్యోగుల కు తగిన గుర్తింపు గౌరవం ఇవ్వండి..