Suryaa.co.in

Andhra Pradesh

కోర్టు ఎన్ని చీవాట్లు పెట్టినా సిగ్గురావడం లేదు

-జగన్ రెడ్డి బ్రాండ్లే తాగాలి
-ఏపీని జగన్ రెడ్డి లిమిటెడ్ కంపెనీగా మార్చారు
-మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

తండ్రి సీఎంగా ఉంటేనే లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ రెడ్డి.. ఇప్పుడు తానే సీఎంగా ఉండి 2 లక్షల కోట్ల అవినీతికి పాల్పడటానికి టార్గెట్ పెట్టుకున్నారు. సీబీఐ జగన్ రెడ్డిపై 43 వేల కోట్ల అవినీతికి సంబంధించి అభియోగాలు మోపింది. సీబీఐ 11 ఛార్జిషీట్లలో జగన్ రెడ్డి ఏ-1గా ఉన్నారు. క్విడ్ ప్రో కో ను కనిపెట్టింది జగన్ రెడ్డి.

కోర్టులతో ఎన్ని చీవాట్లు పెట్టినా సిగ్గురావడం లేదు. హెటిరో, అరవిందోకు సంబంధించి ఇవాళ పత్రికల్లో ఏం వచ్చిందో చూశాం. ప్రారంభంకాని జగన్ రెడ్డి కంపెనీల్లో వందల కోట్లు పెట్టుబడులు పెట్టారు. దీనిని ఎలా డిస్మిస్ చేస్తారని సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టింది. మద్యం పేరుతో పెద్దఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారు. జగన్ రెడ్డి బ్రాండ్లే తాగాలి.

టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. వ్యాపారం కోసం రెడ్డి లేదు.. మరే కులం లేదు. దేశంలో 3.50 లక్షల చదరపు అడుగుల్లో 6,7 భవనాల్లో జగన్ రెడ్డి కుటుంబం నివాసం ఉంటోంది. రాజులు కూడా ఈ విధంగా చేయలేదు. మన ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే జగన్ రెడ్డి బొమ్మ వేస్తున్నారు. ఏపీని జగన్ రెడ్డి లిమిటెడ్ కంపెనీగా మార్చారు.

సంక్షేమం ఎవరికి ఇచ్చారో తెలియదు : మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ
ఇటీవల కర్నూలులో చంద్రబాబు చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. వైసీపీ గడప గడప అంటూ చేసి అభాసుపాలయ్యారు. వైసీపీ సంక్షేమం ఎవరికి ఇచ్చారో తెలియదు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రజలను దోచుకోవడానికే జగన్ రెడ్డి వచ్చారు తప్పితే.. ప్రజలకు మేలు చేయడానికి కాదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం.

జాబు రావాలంటే బాబు రావాలన్న మాట అక్షర సత్యం : ఎన్ ఆర్ ఐ టీడీపీ నేత యామిని పెంద్యాల
రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి, అర్హత ఉన్నా అవకాశాలు లేక నిరాశలో కూరుకుపోయిన యువత భవిష్యత్ కు బంగారు బాటలు వేయాలనే చంద్రబాబు ఆలోచనకు ప్రతిరూపమే ఎన్ ఆర్ ఐ టీడీపీ విభాగం సాధికారక కేంద్రం. మొదటి దశ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఎంబీఏ. బీటెక్, బీబీఎం, ఎంసీఏ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. ఈ శిక్షణ తరగతులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ జరుగుతున్నాయి. నయా పైసా ఖర్చు లేకుండా అన్ని వర్గాల వారికి శిక్షణ ఇస్తున్నాం. మున్ముందు విద్యార్థులకు వసతి కూడా కల్పిస్తాం. నాతో పాటు వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు ఇక్కడి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. యువత భవిష్యత్ కు భరోసా చంద్రబాబు గారు. జాబు రావాలంటే బాబు రావాలన్న మాట అక్షర సత్యం

LEAVE A RESPONSE