-అనురాగ్‌సింగ్ ఠాకూర్ నిజాలు మాట్లాడితే జోగి, అమర్నాధ్‌కు బీపీ పెరిగింది
-లాండ్, శాండ్, మైన్స్, వైన్ మాఫియా దోపిడీకి పగ్గాలేవీ
-అమిత్‌షా – ఎన్‌టీఆర్‌ల భేటీ శుభపరిణాం… రాజకీయాల్లో మంచి మార్పు
– మీడియా సమావేశంలో విష్ణువర్ధన్‌రెడ్డి వెల్లడి
విజయవాడ: జగన్‌మోహనరెడ్డి తన , అసమర్ధ పాలనతో ఆంధ్రప్రదేశ్‌ను 25 ఏళ్లు వెనక్కి నెట్టేశారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించారు. భాజతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ, యువమోర్చా నిర్వహించిన యువ సంఘర్షణ యాత్ర ముగింపు సభకు విచ్చేసిన కేంద్రమంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్‌పై తీసేసిన తాహసీల్దారులైన ఇద్దరు మంత్రులు జోగి రమేష్, గుడివాడ అమర్నాధ్‌లు విమర్శలు చేశారన్నారు. వైకాపా దగాలు, మోసాలు, ముంచి, వంచించిన అంశాలను ప్రజల ముందు పెడతున్నాం. దమ్ముంటే చర్చకు రండని సవాల్ విసిరారు. 38 నెలులుగా జగన్ ముఖ్యమంత్రిగా పాలించారు.
ఆనురాగ్‌సింగ్ చాలా మాట్లాడినా కేవలం 6 అంశాలను పరిశీలిద్దాం. అందులో తప్పులుంటే భాజపా దేనికైనా సిద్దంగా ఉంది. 1).మద్యాన్ని అడ్డగోలుగా అమ్ముతున్నారు.. మద్యం ఆదాయంతో పార్టీని నడుపుతున్నారు …మద్యం ఆదాయంతోనడపాలనుకుంటున్నారు .వైకాపాకు, కేజ్రీవాల్‌కు పెద్ద తేడా లేదన్నారు. ఆమ్ ఆద్మీ దొరికింది. ఇక దొరకాల్సింది వైకాపా అన్నారు. 2021 నవంబరు 25న రూ.17,625 కోట్ల మద్యం అమ్మకాల జరిగితే రూ.12,541 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. అధికారంలోకి వస్తే దశలవారీగా మద్యం నిషేధిస్తామని హామీ ఇచ్చిన మీకు సిగ్గుందా? అని ప్రశ్నించారు. సాక్షాత్‌గా ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అత్యధిక మొత్తానికి మద్యం టెండర్లు పొందారు. ఇది మోసం కాదా? అని ప్రశ్నించారు. 2022 నాటికి రూ.15 వేల కోట్లు ఆదాయం వస్తుందని నిస్సిగ్గుగా బడ్జెట్‌లో పెట్టారన్నారు.
తన శాఖలో 21 లక్షల ఇళ్లు పూర్తిచేయలేని సామర్ధ్యం లేని మంత్రి జోగి రమేష్ మీడియా ముందు కూర్చుని దిగజారుడు వాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
5 కోట్ల జనాభా వున్న ఎపీకి 21 లక్షల ఇళ్లు, 25 కోట్ల మంది వున్న యూపీకి 17 లక్షల ఇళ్లు మాత్రమే ఇచ్చారని, అయినా 4 లక్షల ఇళ్లు మాత్రమే కట్టి వాటిలో ఒక్కటీ కూడా లబ్దిదారులకు ఇవ్వకపోవడం చేతకానితనం కాదా అని ప్రశ్నించారు. పులివెందులలో 18 వేల ఇళ్లు మంజూరుచేస్తే కేవలం 870 ఇళ్లు మాత్రమే పూర్తిచేయడం మీ చేతకాని తనం కాదా? ఈ అంశంపై ముఖ్యమంత్రిని నిలదీయాలని డిమాండ్ చేశారు. సొంత రాష్ట్రంలో చక్కదిద్దలేని జోగిరమేష్ భాజపా రాష్ట్రాల గురించి మాట్లాడటం మానుకోవాలని సూచించారు. నిర్వహణా సామర్ధ్యం లేని జోగిరమేష్‌కు ఒక ఒక్కక్షణం కూడా తన పదవిలో ఉంటే అర్హత లేదన్నారు.
పన్నుల పేరుతో ప్రజల నెత్తినభారం వేస్తూ, ఆ డబ్బునే కొంత పంచుతూ రూ.1.70 లక్షల కోట్లు పంపిణి చేశారని గొప్పలు చెప్పడం మంత్రి జోగికే తగిందన్నారు. ఎపీ ప్రభుత్వం ఆర్ధిక క్రమశిక్షణ పాటించక ఇష్టం వచ్చినట్లు ఆప్పులు చేయడాన్ని కేంద్ర ఆర్ధికశాఖలో ఉండి పరిశీలించబట్టే ఠాగూర్‌గారు ప్రభుత్వాన్ని విమర్శించారని గుర్తించాలన్నారు. 51 మంది రాజకీయ నిరుద్యోగులను ప్రభుత్వ సలహాదారులుగా పేర్కొని ప్రజాధనం దోచిపెడుతున్నారని విఘ్ణువర్ధన్‌రెడ్డి దుయ్యబట్టారు.
రాష్ట్రంలో ఆలయాలు, రధాలు, విగ్రహాల విధ్వంసం వంటి హిందూధర్మ వ్యతిరేక కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నా నిందితులను అరెస్టు చేయకపోవడం మత వివక్షకాదా? అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రిపై సోషల్ మీడియాలో ఎవరైనా విమర్శిస్తే లక్షణం అరెస్టులు చేసే ప్రభుత్వం ఎందుకు ఆలయాలను ద్వంసం చేస్తున్న వారికి పట్టుకోవడం లేదని నిలదీశారు. మసీదులు, దర్గాలు, చర్చిల నిర్మాణాలకు డబ్బులివ్వడం ఓటుబ్యాంకు రాజకీయాలు కాదా? మీరు దోచుకున్న సొమ్ముతే నిర్మిస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఆలయాల హుండీలు, డిపాజిట్ల సొమ్ములు సైతం దోచుకుంటున్న దొంగలు మీరని ఆరోపించారు. పూటకో వేషం వేస్తూ ప్రజలకు పంగనామాలు పెట్టే మీకు భాజపాను మతతత్త్వ పార్టీగా విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. ఇంకా ఆయన ఇలా అన్నారు…..
లాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియా ప్రభుత్వమని ఠాకూర్ విమర్శించారు. ఇది వాస్తవం కాదా? 31 లక్షల పట్టాలిస్తామని చెప్పి రూ.3వేల కోట్లు దోచేశారు. అనువుకాని చోట స్థలాలిచ్చారు. 31లక్షల ఇళ్లు కట్టిస్తామన్నారు ఒక్క ఇల్లు కట్టలేదు.ు. చిత్తశుద్ది, నిజాయితీ ఉంటే ఈ అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలి. ఇసుకను 50 ఏళ్లకు సరిపడా పక్కరాష్ట్రాలకు అమ్మేసుకుంటున్నారు. ఇసుక అమ్మకాలకు ముఖ్యమంత్రి ఫొటోను వాడుకుంటున్నారు. ఇసుక పేరుతో రూ.5 వేల కోట్లు దోచేశారు. ఎపీలో మద్యం డిస్టీలరీలు వైకాపా నేతల చేతుల్లోనే ఉన్నాయి. రూ.10 వేల కోట్ల విలువైన వనరులు దోచేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదు. ఎపీలో గంజాయి, మాదకద్రవ్యాలు లేవా?
రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మంత్రి గుడివాడ అమర్నాధ్ ప్రకటించాలి. 42 ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అతి చిన్నవైన రెండు ప్రాజెక్టులు మాత్రమే పూర్తిచేశారు. మీ భాగస్వామ్య నిధులివ్వకపోవడంతో రైల్వే ప్రాజెక్టులు, రహదారుల ప్రాజెక్టులు ఆగిపోయాయి. మీరు భూమి ఇవ్వకపోవడంతో నెల్లూరుజిల్లాలో రూ.4 వేల కోట్ల విలువైన పరిశ్రమ ఏర్పాటుకాలేదు. భ్రూ సమీకరణ చేయకపోవడంతో పకాశం జిల్లాలో పారిశ్రామిక సమూహం ఏర్పాటుకాలేదు. ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులను మోసం చేశారు. మీ పార్టీ కార్యకర్తలకే వాలంటీర్ల ఉద్యోగాలిచ్చారా? సచివాలయాల్లో ఉద్యోగులను ఎప్పటికి పర్మనెంటు చేస్తారు? టీచర్లు, పోలీసు శాఖలో ఖాళీల భర్తీ ఎప్పుడని ప్రశ్నించారు? దావోస్‌కు వెళ్లి ఏం సాధించారు? పాత సంస్థలనే తిరిగి ప్రారంభించి కొత్తవి ప్రారంభిస్తున్నట్లు చెబుతున్నారు? రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి నెట్టారు. రాష్ట్ర ప్రజల్ని ముంచడానికి, మీ సిఎం డిల్లీ వెళ్లి ప్రధానిని కలియడానికి భాజపాకు ముడిపెట్టవద్దు?
వైకాపా చేసిన తప్పులను ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం. వదిలే ప్రశక్తి లేదు. మీరు కేంద్రం, కేంద్ర మంత్రులపై అసత్యాలు, అవాకులు, చవాకులు మానేయాలి. ప్రతిభావంతుడైన జూనియర్ ఎన్‌టీఆర్ ` భాజపా అగ్రనేత అమిత్‌షా భేటీని భాజపా స్వాగతిస్తోంది. యువత రాజకీయాల్లోకి వచ్చి కలుషిత రాజకీయాలు సంస్కరించాలని మోదీ ఆకాక్షిస్తున్నారు. అమిత్‌షా ` జూనియర్ ఎన్‌టీఆర్‌ల భేటీ గొప్ప రాజకీయ మార్పుకు, శుభ పరిమాణాలకు దారి కాగలదని భాజపా ఎపీ శాఖ భావిస్తోంది.
అనురాగ్‌సింగ్ విమర్శలతో వైకాపా ఉలిక్కిపడిరది. ప్రజలకు సమాధానం చెప్పలేదు. జోగిరమేష్, గుడివాడ అమర్నాధ్‌లు మతి స్థిమితం లేని స్ధాయిలో భాజపాపై ఆరోపణలకు దిగారు. అబద్దాలు పదేపదే చెప్పారు. జగన్ తన పాదయాత్రలో 2.40 ఉద్యోగాలను ఎపీపీఎస్సీ ద్వారా ఇస్తానని ప్రకటించారు. 2 లక్షల ఉద్యోగాలిచ్చానన్నారు. దానికేమిటి రుజువు? కార్యకర్తలకే సచివాలయాల ఉద్యోగాలిచ్చినట్లు మీ నాయకులు చెప్పారు. దానినే మీరు ఉద్యోగాలిచ్చినట్లు భావిస్తున్నారా? రూ.5 వేల జీతాలిచ్చే వాలంటీర్లను ఎలా ఉద్యోగులగా పరిగణిస్తారు?
విభజన అంశాలు పూర్తిచేయలేదనే జోగిరమేష్ విమర్శలు శుద్ద అబద్దం. ప్రతి జిల్లాకు ఏమిచ్చామనేది లెక్కలతో సహా వివరిస్తాం. ఇతర రాష్ట్రాల్లో గంజాయి పట్టుబడటమే ఇతర రాష్ట్రాలు తీసుకునే ఆదర్శమా? భాజపాలో ఎవరికీ స్క్రిప్టులు అవసరం లేదు. వైకాపా కార్యాలయం నుంచే స్క్రిప్టులు తెచ్చి మాట్లాడుతున్నారు. అసహనంతో మాట్లాడితే ప్రజలు అసహ్యించుకుంటారు. పెడనలో కూడా నీకు ఆదరణ కోల్పోయావు. మీడియా సమావేశంలో యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టా వంశీకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీంద్రరెడ్డి పాల్గొన్నారు.