ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్ లో భారీ విజయంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం పట్ల గిడుగు హర్షం వ్యక్తం చేశారు.ఆ మేరకు ఆయన ఈరోజు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుకు ను మర్యాదపూర్వకంగా న్యూ ఢిల్లీ లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. త్వరలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రావాలని ముఖ్యమంత్రి సుఖ్వెంధర్ సింగ్ ను గిడుగు ఆహ్వానించారు.
తదనంతరం గిడుగు మాట్లాడుతూ సుఖ్వెండర్ సింగ్ తాను అనేక పర్యాయాలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను కలిసి పనిచేశామని గుర్తుచేశారు. ఆయన ఈ రోజు ఎంతో అత్యున్నతమైన పదవి అధిరోహించటం చాలా ఆనందంగా వున్నదని వెల్లుబుచారు. సింగ్ నేతృత్వంలో హిమాచల్ ప్రదేశ్ అనేక ప్రజాకర్షక విధానాలు అమలవుతాయని అన్నారు. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ జోడో యాత్ర స్పూర్తితో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావటానికి ప్రతి ఒక్కరితో కలిసి ముందుకు వెలతామని గిడుగు తెలియజేశారు.