– ఇతర దేశాల్లో కొనుగోలు చేసినా తమ దేశంలో వాడడంపైనా నిషేధం
ఇండోనేషియా: యాపిల్‌కు షాక్ ఇస్తూ ఇండోనేషియా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. యాపిల్ విడుదల చేసిన లేటెస్ట్ మోడల్ ఐఫోన్ 16పై నిషేదం విధించింది. తమ దేశంలో ఈ ఫోన్ విక్రయాలు, వినియోగంపై ఆంక్షలు పెట్టింది. ఇతర దేశాల్లో కొనుగోలు చేసినా, తమ దేశంలో వాడడంపైనా నిషేధం విధించింది. ఇండోనేషియాలో యాపిల్ ఐఫోన్ 16 వాడటానికి ఐఎంఈఐ సర్టిఫికేషన్ లేదని తెలిపారు. ఈ విషయాన్ని ఆ దేశ పరిశ్రమల శాఖ మంత్రి గమివాంగ్ కర్తసస్మిత వెల్లడించారు.