ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ వేటు పడిన వారి స్థానంలో అధికారులను నియమి స్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ట త్రిపాఠి, ప్రకాశం ఎస్పీగా సునీల్, పల్నాడు ఎస్పీగా బిందు మాధవ్, చిత్తూరు ఎస్పీగా మణికంఠ, అనంతపురం ఎస్పీగా అమిత్ బర్ధార్, నెల్లూరు ఎస్పీగా ఆరీఫ్, ఎన్నికల అధికారులుగా కృష్ణా జిల్లాకు డీకే బాలాజీ, అనంతపురం జిల్లాకు వినోద్‌కుమార్, తిరుపతి జిల్లాకు ప్రవీణ్‌కుమార్‌ను నియమించారు.
గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గుంటూరు రేంజ్ ఐజీగా గురువారం సర్వశ్రేష్ఠ త్రిపాఠి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూండి, ఇతర ముఖ్య అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు.
పల్నాడు జిల్లా ఎస్పీగా బిందు మాధవ్
పల్నాడు జిల్లా ఎస్పీగా గురువారం బిందు మాధవ్ బాధ్యతలు చేపట్టారు. ఆయన గతంలో పల్నాడు ఏఎస్పీగా పనిచేశారు. పదోన్నతిపై ఎస్పీగా వేరే జిల్లాకు బదిలీ అయ్యారు. తాజాగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ వేటు పడిన ఎస్పీ స్థానంలో పల్నాడు జిల్లా ఎస్పీగా ఇక్కడ నియమించగా బాధ్యతలు స్వీకరించారు.