Suryaa.co.in

Andhra Pradesh

దేవాదాయ శాఖ సలహాదారు నియామకం రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై హర్షం

– స్వరూపానందకు ఆలయాలపై పెత్తనం చేసే అధికారం ఎవరిచ్చారు?
– త్వరలో మరిన్ని నియామకాలకు స్వరూప రంగం సిద్ధం
– స్వరూపా ప్రయత్నాలను అడ్డుకుంటాం
– బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ హెచ్చరిక

అమరావతి: దేవాదాయ శాఖ గౌరవ సలహాదారుగా జ్వాలాపురపు శ్రీకాంత్ న నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన 630 జీవో అక్రమమైనదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా జస్టిస్ సోమయాజులు ఇచ్చిన ఉత్తర్వులు పై బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుల పేరుతో పదవులు సృష్టించి తమ పార్టీలోని రాజకీయ నిరుద్యోగులకి ఈ పదవులను కట్టబెడుతూ, ప్రభుత్వ ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేస్తుంది. అంతటితో ఆగక ప్రభుత్వానికి సంబంధం లేని భక్తులు దాతలు ఇచ్చిన సంపదతో నడిచే దేవాదాయ ధర్మాదాయ శాఖకు కూడా ఈ సలహాదారులు నియమించడాన్ని, రాష్ట్రంలో ఉన్న భక్త బృందాలు అర్చక సంఘ నాయకులు దేవాదాయ శాఖ ఉద్యోగులు బ్రాహ్మణ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించిన కూడా, జగన్ ప్రభుత్వం పంతంతో ఈ శ్రీకాంత్ కు సలహాదారు పదవి కట్టబెట్టింది.

దాని ద్వారా దేవాదాయ శాఖలోని సిజిఎఫ్ ఏజిఎఫ్ నిధులు దుర్వినియోగం జరుగుతాయని వైసిపి పార్టీకి సంబంధించిన బ్రాహ్మణ సంఘమే హైకోర్టులో పిల్ దాఖలు చేసిందని దానిపైన ప్రధాన న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైకోర్టులకు అడ్వకేట్ జనరల్ లో కూడా గౌరవ సలహాదారులు నియమిస్తారా అని ప్రభుత్వంలో అల్టికారుల కొరత ఏమైనా ఉందా అని దేవాదాయ శాఖకు సలహాదారులు ఎందుకని దేవాదాయ శాఖ చట్టంలో లేని బాధ్యతల్ని ఎలా బయట వారికి ఇస్తారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ జీవోపై స్టే విలించటంపై రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్లో గుండెల్లో కానుకలకు సమర్పించే భక్తులు దేవాలయ అభివృద్ధి కోసం చందాలు ఇచ్చే భక్తులు అర్చకులు బ్రాహ్మణ సంఘాలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు శ్రీధర్ తెలియజేశారు.

వీనంతటికీ కారణం విశాఖ శారదా పీఠం స్వరూపానంద స్వామీజీ ప్రమేయంతోనే ఒత్తిడితోనే జగన్ ప్రభుత్వం దేవాదాయ శాఖకు ఈ సలహాదారుల నియామకం జీవో ఇచ్చిందని స్వరూపానంద స్వామికి దేవాదాయ శాఖ పై ఆదిపత్యం చెలాయించే అధికారం, జగన్ ప్రభుత్వం ఇవ్వటం విడ్డూరంగా ఉందని భక్తుల సొమ్మును దేవాలయాల ఆస్తులను రాజకీయ నిరుద్యోగుల పాలు చేస్తారా అని శ్రీధర్ ప్రశ్నించారు.

త్వరలో స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో అర్చకులకు శిక్షణ ఇచ్చే సీతా సంస్థ డైరెక్టర్లుగా, ధార్మిక పరిషత్ డైరెక్టర్లుగా ధర్మ ప్రచార పరిషత్ డైరెక్టర్లుగా లక్షల రూపాయలు తీసుకొని నియమించేందుకు విశాఖ శారదా పీఠం కేంద్రంగా ప్రణాళికలు సిద్ధం చేశారని, దీనిపైన కూడా న్యాయస్థానాల్ని ఆశ్రయించి దేవుడు సొమ్ము ఆస్తులు రాజకీయ నిరుద్యోగుల పాలు కాకుండా న్యాయపోరాటం చేస్తామని శ్రీధర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

LEAVE A RESPONSE