చెత్తపన్ను కట్టకపోతే ఇంత దారుణమా?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

విజయనగరం పూల్‌బాగ్ కాలనీలోని సాయి అమృత అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వారు చెత్త పన్నుకట్టలేదు.దీంతో మున్సిపల్ సిబ్బంది చెత్త తీసుకెళ్లి అదే అపార్ట్‌మెంట్‌ గేటు ముందు వేశారు.దీన్ని చిత్రీకరించిన వ్యక్తి సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేసి స్థానికులపై దాడికి పాల్పడ్డారు మున్సిపల్ సిబ్బంది.ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, నారా లోకేష్ స్పందించారు.

చెత్త పన్ను కట్టలేదని చెత్త తెచ్చి వేయడం దారుణమని పేర్కొన్నారు. చెత్త పన్ను పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని పీడిస్తోందని ఆరోపించారు.చెత్త పన్ను కట్టకపోతే సామాన్లు జప్తు చెయ్యడం.. ఇంటి ముందు చెత్త వెయ్యడం ఏపీలో నిత్యకృత్యమయ్యారని మండిపడ్డారు. సీఎం జగన్ చెత్తపన్నును వెంటనే రద్దు చేసి, స్థానికులపై దాడికి పాల్పడ్డ మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply