ముఖ్యమంత్రి పర్యటన
విజయవాడ, : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 20వ తేదీ విజయవాడ పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ పున్నమి ఘాట్‌లోని బెరం పార్క్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
డాక్టర్ బాలాజీ మాట్లాడుతూ, “పర్యాటక ప్రాంతాలు శుభ్రంగా, ఆకర్షణీయంగా ఉండాలి. ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా బెరంపార్క్ ప్రాంతం విజయవాడ అందాలను ప్రతిబింబించేలా మెరుగుపరచాలి” అని తెలిపారు.
ఈ నేపథ్యంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలను వేగవంతం చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, పూల మొక్కలు నాటడం, కొత్త బెంచీలు ఏర్పాటు చేయడం, ప్రత్యేక లైటింగ్ సిస్టం మెరుగుపరచాలన్నారు.
“పర్యాటక అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకం. అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా అన్ని పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడం మన లక్ష్యం,” అని డాక్టర్ బాలాజీ స్పష్టం చేశారు.
అంతే కాకుండా, భద్రతా ఏర్పాట్లు, రాకపోకల నియంత్రణ వంటి అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.