వీళ్లంతా శుద్ధ పూసలు.. ఆణిముత్యాలు..స్వాతి ముత్యాలు..కానీ చంద్రబాబు మాత్రం దోపిడీ దారుడు?!
జగన్ మోహన్ రెడ్డి గారి మీద CBI,ED తో సహా పుట్టెడు కేసులు నమోదు అయి వున్నాయి..ఛార్జ్ షీట్లు నమోదు అయ్యి వున్నాయి..అయన స్వయంగా జైలులో కూడా గడిపిన నేపథ్యం వున్నది.వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి గారికి కూడా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రతి కేసులో సమాన భాగస్వామ్యం వుంది..అంతే జైలు జీవిత నేపథ్యం వుంది..
ఒక ప్రస్తుత ఎమ్మెల్యే గతంలో మంత్రిగా పని చేసిన సమయంలో క్యాసినో నిర్వహణ చేసారు..నేటికీ పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు అని ఆరోపణలు వున్నా ప్రభుత్వ పరంగా నో యాక్షన్..
ఒక ప్రస్తుత మంత్రి స్వయంగా ఒక కాంట్రాక్టర్ నుంచి బెంజ్ కార్ బహుమతిగా తీసుకున్న ఆరోపణలు వచ్చినా నో ఏక్షన్..అదే మంత్రి తన ఇలాకాలో వున్న ఒక కంపెనీ కి చెందిన వందల ఎకరాల భూమిని తన కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటే..దాని మీద income tax డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వచ్చినా నో యాక్షన్..
ఇంకో ప్రస్తుత మంత్రి కుటుంబం వారి ప్రాంతంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు కోసం acquire చేసుకున్న భూమిని ఆ యాజమాన్యం నుంచి కారు చవకగా తన కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటే నో యాక్షన్..
గుడ్ మార్నింగ్ పేరిట హడావుడి చేసే ఒక ఎమ్మెల్యే ఇంకో సోలార్ ప్లాంట్ ఏర్పాటు కోసం acquire చేసిన భూమిని ఆ యాజమాన్యం నుంచి తన కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటే నో యాక్షన్..
ఒక ఎమ్మెల్యే తన ప్రాంతంలో ఏర్పాటు చేయదలిచిన అండర్ గార్మెంట్స్ పరిశ్రమ యాజమాన్యాన్ని డబ్బు డిమాండ్ చేస్తే..ఆ కంపెనీ పక్క రాష్ట్రానికి తరలి వెళ్తే నో యాక్షన్..
ఒక ఎంపీ స్వంత కుటుంబానికే చెందిన ఇంకో మాజీ ఎంపీ హత్య కేసులో ముద్దాయి అని నిర్ధారణ అయితే నో యాక్షన్..
ఒక ఎంపీ దేశం మొత్తానికి నగ్న ప్రదర్శన చేశాడు అని వీడియో బయటకు వస్తే..దాని నిగ్గు తేల్చే ప్రయత్నం లేదు పైగా నో యాక్షన్..
ఇంకో మంత్రి తాను గతంలో మంత్రిగా పని చేసిన రోజుల్లో మాజీ సైనికులకు చెందిన భూములను తప్పుడు మార్గంలో NOC లు ఇచ్చి వాటిని తన స్వంత కుటుంబ సభ్యులు పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటే..అదే అంశాన్ని సిట్ నిర్ధారించి చర్యలకు రికమెండ్ చేసినా నో యాక్షన్..
ఒక ఎమ్మెల్యే గుంటూరు జిల్లాలో అడ్డగోలుగా గ్రావెల్ తవ్వకాలు దోపిడీ చేస్తున్నా నో యాక్షన్..
ఇంకో ఎమ్మెల్యే కృష్ణా జిల్లాలో అడ్డగోలుగా గ్రావెల్ మరియు ఇసుక తవ్వకాలు దోపిడీ చేస్తున్నా నో ఏక్షన్..
గుంటూరు జిల్లాలో ఇంకో ఎమ్మెల్యే అడ్డగోలుగా భూములు ఆక్రమించుకున్నారు అని ఆధారాలతో బయట పడినా నో యాక్షన్..
ఒక ఎంపీ ముంపుకు గురి అయ్యే ఆవ భూములను ఇళ్ళ స్థలాల ప్లాట్స్ కోసం ప్రభుత్వానికి అప్ప చెప్పి కోట్ల రూపాయలు కొట్టేశారు అని సాక్ష్యాలతో రుజువు అయినా నో యాక్షన్..
ఇంకో మంత్రి తను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన మీద వున్న ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించిన కేసుకు సంబంధించిన ఫైలు స్వయంగా కోర్టు నుంచే దొంగతనం చేయించారు అని ఆరోపణలు వున్నా నో యాక్షన్..
ఇంకో మహిళా మంత్రి గ్రానైట్ మైనింగ్ కోసం భూ యజమానులను బెదిరించారు అని ఆరోపణలు వచ్చినా నో యాక్షన్..
ఒక ఎంపీ మీద జరిగిన income tax రైడ్ లో 400 కోట్లు క్యాష్ అలాగే 1200 కోట్లు లెక్కలు చూపని లావాదేవీలు వున్నాయి అని స్వయంగా income tax డిపార్ట్మెంట్ ప్రకటించినా నో ఏక్షన్..
ఒక MLC స్వయంగా హత్య కేసులో ముద్దాయి అయినా కంటి తుడుపు సస్పెండ్ నాటకం ఆడి మళ్లీ వెంట తిప్పుకుంటూ అతనికి పూల వర్షం పాలాభిషేకం చేస్తున్నా నో ఏక్షన్..
ఇంకో ఎంపీ అలాగే అయన కొడుకు ఇరువురు ఢిల్లీ మద్యం కేసులో ముద్దాయిలు గా నమోదు అయినా నో యాక్షన్..
తాజాగా ఇంకో ఎమ్మెల్యే ED దాడులు ఎదుర్కుంటూ స్కాము ఆరోపణలు వచ్చినా నో యాక్షన్..
ఇక ఇసుక మాఫియా..భూ ఆక్రమణలు..అక్రమ మైనింగ్..ఆరోపణలు ఎదుర్కుంటున్న వారి సంఖ్య అయితే లెక్కే లేదు..
ఇక విశాఖలో భూములు ఆక్రమించిన ఎంపీలు ఇద్దరు మీద నో యాక్షన్..
అయినా సరే వీళ్ళు అందరూ ఏమీ తెలియని అమాయకులు..
శుద్ధ పూసలు..
ఆణిముత్యాలు..
స్వాతి ముత్యాలు..
కానీ చంద్రబాబు గారు మాత్రం దోపిడీ దారుడు..
వాహ్ క్యా బాత్ హై..
– రాజేష్ అప్పసాని