Suryaa.co.in

Features

ఆసుపత్రుల్లో ఆపరేషన్లు మోసమేనా?

మందుల నుంచి పరీక్షల వరకూ మోసమేనా?
బ్రెయిన్‌డెడ్లలో అసలు నిజమెంత? అబద్ధమెంత
అవసరం లేకున్నా మందులెందుకు రాస్తుంటారు?
ఆర్‌ఎంపీలకు ఇచ్చే కమిషన్ల కథేమిటి?
టార్గెట్లు పూర్తి చేసిన డాక్టర్లకు విదేశీ టూర్లు
ఫార్మా కంపెనీలే ఆసుపత్రులను బతికిస్తున్నాయా?
మెడికల్ మాఫియాకు పొలిటీషియన్ల దన్ను?
ప్రభుత్వం ఆయుర్వేదాన్ని ఎందుకు ప్రోత్సహించదు?

మనం ఆసుపత్రికి వెళితే డాక్టర్లు రాసిచ్చే డజను మందుల వెనుక కుంభకోణం ఉందా? డాక్టర్లు రాసే పరీక్షల వెనుక కాసుల కథ ఉందా? బ్రెయిన్ డెడ్ అని డాక్టర్లు చెబితే దానిని నమ్మకూడదా? గుండె, క్యాన్సరు, మోకాలు మార్పిడి ఆపరేషన్లలో 40 నుంచి 52 శాతం అంతా మోసమేనా? ఇంకా ఏమేం మోసాలు.. ఎలా.. ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవాలనుందా? అయితే ఇది కచ్చితంగా మీకోసమే. చదివి జాగ్రత్త పడండి. మీ ఆరోగ్యాన్ని ఫేక్‌ల చేతిలో పెట్టకండి.

భారత కేంద్ర పార్లమెంటు ప్యానల్ చెప్పే విషయం ఏంటంటే.. రాబోయే రోజుల్లో భారత వైద్య వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అవబోతుంది.

దేశం మొత్తం మీద జరిగే గుండె సర్జరీల్లో 42% మోసం
.. అంటే అవసరం లేకున్నా చేయడం.

దేశంలో జరిగే మొత్తం హార్ట్ సర్జరీలో 52% మోసం
దేశంలో జరిగే 48% యూట్రస్ సర్జరీలు మోసం
దేశంలో జరిగే 47% క్యాన్సర్ సర్జరీలు మోసం
దేశంలో జరిగే 48 % నీ రీప్లేస్మెంట్ సర్జరీలు మోసం
దేశంలో జరిగే 45% C సెక్షన్ సర్జరీలు మోసం

మహారాష్ట్రలో టాప్ 43 డాక్టర్స్ ను కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ ఇంటర్వ్యూ చేయగా తెలిసిన విషయం.. అక్కడ డాక్టర్స్ అంతా టార్గెటెడ్ బేస్ సర్జరీలు చేయటం. ఒక డాక్టర్ నెలకు ఎన్ని సర్జరీలు చేయాలి అనే లెక్క.. ఒకవేళ టార్గెట్ రీచ్ కాకపోతే ఫేక్ సర్జరీలు చేసి పూర్తి చేస్తున్నారు. ఒక సీనియర్ డాక్టర్కు నెలకు కోటి రూపాయలు జీతం ఉంటుంది. దానికి తగిన టార్గెట్ నెలకు 1000 సర్జరీలు చొప్పున ఉంటుంది. అవి పూర్తిగా కాకపోతే, నెల చివరలో వారి మీద విపరీత ఒత్తిడి ఉంటుంది.

ఓపిలో ఫేక్ పేషెంట్ నమోదు ద్వారా సర్జరీలు పూర్తి చేస్తారు. ఈ టార్గెట్ పూర్తి కాకపోతే సీరియస్ వార్నింగ్ ఇస్తారు లేదా ఉద్యోగం నుంచి తీసివేయడం కూడా జరుగుతుంది. డాక్టర్స్ కు వేరే మార్గం లేదు. మిడిల్ క్లాస్ ప్రజలు ఏదైనా పెద్ద సర్జరీకి దొరికితే, ఇక వాళ్ల పని అంతే. అందువల్ల ఈ మిడిల్ క్లాస్ ప్రజలు హాస్పిటల్ ఖర్చులు తట్టుకోలేకనే, పేదవారు అయిపోవటం కటిక వాస్తవం.

ఈ ఊబి నుంచి తప్పించుకోవడం ఎలా అంటే.. హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు. మళ్ళీ అందులో కూడా ఒక రకమైన దోపిడీ వుంటుంది. నాలెడ్జ్ ఉన్న వాళ్లకు ఒక రకం. లేని వాళ్ళకి ఒక రకం. ఇందులో ఇంత తతంగం జరుగుతున్నా.. ఆయుర్వేదం మాత్రం ప్రచారం చేయరు. ప్రోత్సహించరు.

టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ప్రకారం…
చనిపోయిన మనిషిని బతికున్నట్లుగా సర్జరీలు చేసి మధ్యలో చనిపోయాడు అని అబద్ధం చెబుతున్నారు. ఉదాహరణ బ్రెయిన్ డెడ్ వంటివి. ఈ విషయాలు ఆ డాక్టర్స్ చెప్పినవే స్వయంగా.

దేశంలో ఏడాదికి రెండు వేల కిడ్నీలు అమ్మబడుతున్నాయి. ఇవన్నీ వాళ్లు అమ్మినవి కాదు. మోసపూరితంగా దొంగిలించబడినవి ఎన్నో. అందులో ఎక్కువగా ఉద్యోగం వచ్చిందని మెడికల్ చెక్ అప్ అని తీసుకెళ్లి, మనిషికి తెలియకుండా మందు ఇచ్చి , కిడ్నీలు దొంగలించేవి కూడా ఉన్నాయి. ఉదాహరణకు న్యూఢిల్లీలోని ఫోర్టిస్ హాస్పిటల్స్. మన దేశంలో ఎన్నో ఆర్గాన్ ట్రాఫిక్ రాకెట్లు ముఠాలు దొరికాయి. ఇలా దేశంలో సంవత్సరానికి ఇవి వేలలో జరుగుతున్నాయి. ఈ హాస్పిటల్స్ ని కాపాడడానికి , వాటి వెనుక పెద్ద నెట్వర్క్ ఉంటుంది . వీటినీ లీగల్గా రక్షించడానికి పెద్ద పెద్ద లాయర్స్ ఉంటారు. పదవిలో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్ అండ ఉంటుంది. వీళ్ళని ఎదురుకోవటం సామాన్యుడి తరం కాదు.

హాస్పిటల్ రిఫరల్ స్కాం:
ఇది మేజర్ గా జరిగే స్కాం. విలేజ్ లలో ఉన్నఆర్‌ఎంపీలు కొందరు డాక్టర్లను సూచిస్తారు. కొందరు వారే స్వయంగా తీసుకెళ్లి కొన్ని హాస్పిటల్ లో వైద్యానికి చేరుస్తారు. వీళ్లకు పేషెంట్ కట్టిన ఫీజుల్లో 20 నుంచి 45 శాతం వరకు కమిషన్ ఉంటుంది. ఇక్కడ కనీసం మనల్ని కాపాడుకునే అవకాశం ఇచ్చేది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. వీటిలో పాలసీ బజార్ అనేది చాలా బెస్ట్.

డయాగ్నస్టిక్ స్కాం:
మనకు అవసరం లేని టెస్టులు అన్నీ కూడా రాసి, వాటిలో కొంత పర్సంటేజీలు ఆయా డాక్టర్లు పొందుతారు. ఇండియాలో ఉన్న ఒక లక్ష డయాగ్నస్టిక్ సెంటర్ లో, ఒక వెయ్యి వరకు మాత్రమే ప్రభుత్వ గుర్తింపు పొందినవి ఉన్నాయి.

మెడిసిన్ స్కాం: డాక్టర్లు స్వయంగా.. ఫలానా మెడికల్ షాప్ కు లేదా ఫలానా కంపెనీ అని రాస్తారు. ఒక న్యూస్ ఆర్టికల్ ప్రకారం. ఉదా: సన్ ఫార్మా, గ్లెన్‌మార్క్ అనే కంపెనీలు. డాక్టర్లకు 1000 కోట్లు ప్రిఫర్ చేస్తున్నాయి విదేశాలకు టూర్లు , ఇతర లగ్జరీ వస్తువులు ఇస్తున్నాయి. కొన్ని హాస్పటల్స్ ఫార్మా కంపెనీలకు అగ్రిమెంట్లు చేసుకుంటాయి. ఇవి ఆ కంపెనీలో తక్కువ ధరకు కొనుగోలు చేసి, 15 నుంచీ 20 రెట్లు ఎక్కువ ధరకు పేషెంట్లకు అమ్ముతాయి.

దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది ? ఇంతలా పేట్రేగిపోయిన ఆధునిక వైద్య వ్యవస్థ ఆయుర్వేదాన్ని ఎందుకు బ్రతకనిస్తుంది. ? పై సమస్యలు ఎన్నింటికి ఒకే ఒక ముందు భారతీయ సాంప్రదాయ వైద్య విధానం ఆయుర్వేదాన్ని ఫాలో అవటం. అంటే ఆహార విహార పానీయాలను సరి చేసుకోవడం. ఆయుర్వేదం అంటే రోగం రాకముందు మరియు వచ్చినాక కూడా అవసరం ఉండేది.

– సంపత్‌రాజు

LEAVE A RESPONSE