Suryaa.co.in

Andhra Pradesh

పోలీసులు, నార్కోటిక్స్ నిద్రపోతున్నారా?

-పురందేశ్వరి కుటుంబ పరువు తీసే ప్రయత్నాలు
-పురందేశ్వరి కొడుకు కంపెనీతో వీరభద్రరావుకు సంబంధం లేదు
-కూనం వీరభద్రరావు పేరుతో ఆ డ్రగ్ కంటైనర్ వచ్చింది
-సంధ్య మెరైన్ సంస్థకి , కూనం తో ఎటువంటి సంబంధం లేదు
-కూనం పూర్ణచంద్రరావు వైవి సుబ్బారెడ్డికి సన్నిహితుడు
– బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ

విజయవాడ: నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ అవసరాలకి వైఎస్సార్ సిపి వాలంటీర్లని వాడుకుంటోంది. ఎన్నికల‌కోడ్ ని పోలీసులు పట్టించుకోవటం లేదు. సిఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి అవినీతి పెరిగిపోయింది, ఆయన నాయకులు భ్రష్టాచార్ నాయకులు. అవినీతిలో కూరుకుపోయి పోటీపడుతున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ పెరిగిపోతోందని బిజెపి ఎప్పటి నుంచో ఆందోళన చేస్తోంది. విచ్చలవిడి డ్రగ్స్, మద్యం వల్ల ఆడవారిపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి.

విశాఖ పోర్టులో 25 వేల డ్రగ్స్ పట్టుకోవడం సంచలనం కలిగిస్తోంది. రాష్ట్ర పోలీసులు, నార్కోట్రిక్స్ నిద్రపోతున్నారా? సిబిఐ ఇంటర్ పోల్ ఇన్ ఫర్మేషన్ వచ్చేంత వరకు రాష్ట్ర పోలీసులు ఏం చేస్తున్నారు? సిబిఐ పట్డుకోకపోతే ఎంతమంది యువత, విద్యార్ధులకి ఈ డ్రగ్స్ చేరేవి? వాళ్ళ భవిష్యత్తు ఏమయ్యేది? ఇలాంటి సంఘటనలపై ప్రభుత్చానికి చీమ కుట్టినట్లు కూడా లేదు.

సంధ్యా ఆక్వా లిమిటెడ్ కూనం వీరభద్రరావు పేరుతో ఆ డ్రగ్ కంటైనర్ వచ్చింది. సంక్రాంతి సంబరాలలో వైసీపీ నాయకులతో కలిసి కూనం వీరభద్రరావు, ఆయన భార్య పెద్ద పెద్ద కటౌట్లు వేయించుకున్నారు. బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరికి , వారి కుటుంబ సభ్యులకు అంటగట్టే ప్రయత్నం వైసీపీ చేస్తున్న దానిని ఖండిస్తున్నాం. ఆయన సోదరుడు కూనం పూర్ణచంద్రరావు సంతనూతలపాడు నియోజకవర్గంలో వైవి సుబ్బారెడ్డికి సన్నిహితుడు. ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి విశాఖ ఇంచార్జి. అందుకే కూనం కుటుంబ సభ్యులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.

సంద్య మెరైన్ సంస్థ 1992 లో ప్రసాదరావు స్ధాపించగా డైరక్టర్ గా కూనం వీరభద్రరావు ఉన్నారు. 2005 లో అవకతవకలు కారణంగా ఆయనని బయటకి పంపించారు. అప్పటినుండి సంధ్య మెరైన్ సంస్థకి , సభ్యులకు కూనం వీరభద్రరావు తో ఎటువంటి సంబంధం లేదు. పురందరేశ్వరి కొడుకు డైరెక్టర్ గా ఉన్న సంస్థ అక్వాటిక సంస్థ. దానికి కూడా కూనం వీరభద్రరావు తో అతని సంధ్య ఆక్వా సంస్థతో సంబంధం లేదు.

పురందేశ్వరి కుటుంబ పరువు తీయడానికే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్డీఏ కూటమిని చూసి, వైసీపీ భయపడుతోంది అందుకే ఇలాంటి అసత్య, అబద్దపు ప్రచారాలు చేస్తోంది. ప్రజలు దీనిని గమనిస్తున్నారు.

LEAVE A RESPONSE