సీబీఐ విధులకు మేం ఆటంకం కలిగించలేదు

– డ్రగ్స్ కేసు సీబీఐ విచారిస్తోంది
– నగర సీపీ రవిశంకర్

విశాఖపట్నం : విశాఖ పోర్టులో కంటెయినర్ లో డ్రగ్స్ కేసుపై నగర సీపీ రవిశంకర్ స్పందించారు. దీన్ని పూర్తిగా సీబీఐ దర్యాప్తు చేస్తోందని చెప్పారు.విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

సీబీఐ డాగ్ స్క్వాడ్ సహకారం కోరితే ఇచ్చినట్లు తెలిపారు. తమ వల్ల సోదాలు ఆలస్యమయ్యాయని చెప్పడం సరికాదన్నారు. నగరంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నట్లు చెప్పారు. కంటెయినర్ టెర్మినల్ తమ కమిషనరేట్ పరిధిలోకి రాదన్నారు. కస్టమ్స్ ఎస్పీ పిలిస్తే వెళ్లినట్లు వివరించారు. సీబీఐ విధి నిర్వహణకు తమవల్ల ఆటంకం కలగలేదని తెలిపారు.

Leave a Reply