Suryaa.co.in

Andhra Pradesh

మంత్రిగా రోజా ఒక్కరోజైనా వచ్చిందా?

-అరకు అభివృద్ధి అన్నారు..సున్నం పెట్టారు
-ట్రైబల్‌ యూనివర్సిటీ, మెడికల్‌ కాలేజీ కట్టారా?
-గిరిజనులపై ప్రేమ ఇదేనా…జగన్‌?
-మైనింగ్‌ మాఫియాతో సంపదను దోచేశారు
-పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి

అరకును రూ.600 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి రూ.6 లక్షలు కూడా ఇవ్వలేదు. మంత్రి రోజా ఒక్కరోజు కూడా రాలేదట..ఇదే పాలన అంటూ పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అరకులో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. అరకు ఎమ్మెల్యే ఏమైనా పనికి వచ్చాడా? అంతా దోపిడీ అంట కదా… అరకు అభివృద్ధి ఏమైనా జరిగిందా? అని ప్రశ్నించారు. 600 కోట్లతో అరకు అభివృద్ధి అని చెప్పి రూ.6 లక్షలు కూడా ఇవ్వలేదు. టూరిజం అభివృద్ధి అయి ఉంటే అంటే ఎంతో మందికి జీవనోపాధి దొరికేది.

మంత్రి రోజా ఒక్క రోజు కూడా ఇక్కడకు రాలేదట. గిరిజనులపై జగన్‌కు ఉన్న ప్రేమ ఇదేనా? ట్రైబల్‌ యూనివర్సిటీ, మెడికల్‌ కాలేజీ, ఇంజనీరింగ్‌ కాలేజీ అన్నారు…కట్టలేదు. వైఎస్‌ హయాంలో రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చా రు. ఇప్పుడు అరకు ప్రాంతంలో యథేచ్ఛగా మైనింగ్‌ మాఫియా జరుగుతోంది. గుట్టలు గుట్టలు అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారు. ప్రకృతి సంపదను దోచేశారు. గిరిజన ప్రాం తాలకు కనీసం ప్రత్యేక ప్యాకేజీలు కూడా లేవు. ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదు. పదేళ్లు రాష్ట్రాన్ని బాబు, జగన్‌ కలిసి సర్వనాశనం చేశారు. అభివృద్ధిలో మనం 20 ఏళ్ల వెనక్కు వెళ్లిపోయాం. రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేదు. ప్రజల అవసరాలు ఏంటో తెలుసు కునే ముఖ్యమంత్రి లేనే లేడు. ప్రజలను కలిసే సీఎం లేనే లేడు. ప్రజలకు అపాయింట్‌మెంట్‌ లేదు…ఎమ్మెల్యేలను, మంత్రులను కలవడు. పెద్ద పెద్ద గడీలు కట్టుకున్నాడు అని విమర్శించారు.

LEAVE A RESPONSE