Suryaa.co.in

Features Political News

ఏపీలో గంజాయ్.. దళారుల ఎంజాయ్

-దేశంలో గంజాయి ఎక్కడ పట్టుపడ్డా ఆ మూలాలు ఆంధ్రాలోనే
-నిరుద్యోగం, ఉపాథికల్పనలో పాలకుల వైఫల్యం
-దాని ఫలితమే గంజాయి రవాణా
-విశాఖలో అధికార పార్టీ నేతల కనుసన్నులలో గంజాయి అమ్మకాల ఆరోపణలు
-నాడు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్.. నేడు గంజాయిప్రదేశ్
(పి. అనిల్)

ఒకప్పుడు దేశం మొత్తానికి బియ్యం ఎగుమతి చేస్తూ అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్.. నేడు జగన్ రెడ్డి పాలనలో దేశం మొత్తానికి గంజాయి సరఫరా చేస్తూ గంజాయిప్రదేశ్ గా మారింది. వైసీపీ పాలనలో పాఠశాలలు, కాలేజీలు, బడ్డీ కొట్లలో సైతం గంజాయి,డ్రగ్స్ అమ్మతున్నారు. పాఠశాలలు, కాలేజీలు, బడ్డీ కొట్లలో గంజాయి,డ్రగ్స్ అమ్మతున్నారు, మొన్న కర్నూలు మెడికల్ కాలేజీలో విద్యార్దుల దగ్గర గంజాయి పట్టుబడింది.

మరో వైపు ఒంగోలు రిమ్స్ కాలేజీలో మెడికల్ విద్యార్దులు పట్టపగలే గంజాయి సేవించి వీధిరౌడీల్లా దాడులు చేసుకున్నారు. రాష్ట్రంలో పరిస్ధితి చూసి విద్యార్దులు తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర సామాజిక న్యాయసాధికారిత మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం బాలల్లో గంజాయి వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 12 వ స్ధానంలో, 18-75 ఏళ్ల లోపు గంజాయి వినియోగంలో 11 వ స్ధానంలో ఉంది. బాల్లో ఓపియడ్స్ కి సంబందించిన మాదక ద్రవ్యాల వినియోగంలో 10 వస్దానంలో ఉంది.

దేశ వ్యాప్తంగా 272 జిల్లాల్లో మాదక ద్రవ్యాల వినియోగం, ప్రభావం తీవ్రంగా ఉన్నట్టు కేంద్రం గుర్తిస్తే… అందులో ఉమ్మడి విశాఖ, తూ.గో, పగో. కృష్ణా జిల్లాలున్నాయి. టీడీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్, ఎంజీఎన్.ఆర్.ఈజీఎస్ పనులు వంటి వాటిలో ఏపీ నెం 1 స్ధానంలో ఉంటే.. నేడు గంజాయి అక్రమ రవాణాలో నెం.1 స్ధానంలో ఉంది. అధికార పార్టీ నేతలు తన అక్రమ సంపాదన కోసం రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియాలను పెంచిపోషిస్తూ జాతిని నిర్వీర్యం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగానికి ప్రధాన కారణంనిరుద్యోగిత ఉద్యోగం.

ఉపాధి లేని నిరుద్యోగులు భవిష్యత్ పై నిరాశ నిస్పృహలకు లోనై మత్తుపధార్ధాలకు బానిసలైవుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి లేక మత్తు పధార్దాలకు బానిసలై నాలుగేళ్లలో 1745 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వైసీపీ పాలనలో ఏపీ గంజాయి డెన్ గా మారిందని, టీడీపీ అనేక సార్లు విమర్శలు గుప్పించింది. , విశాఖ, తూ.గో ఏజెన్సీ ఏరియాల్లో ఒక అధికార పార్టీ ప్రజాప్రతినిధి, స్ధానిక వైసీపీ నేతల ఆధ్వర్యంలో సుమారు 15 వేల ఎకరాల్లో గంజాయి సాగవుతోందన్న ఆరోపణలు మీడియాలో హల్‌చల్ చేశాయి.

టీడీపీ హయాంలో ఉత్తరాంధ్రను పారిశ్రామిక హబ్ గా అభివృద్ది చేస్తే నేడు గంజాయి డెన్ గా అభివృద్ది చేశారు. మన రాష్ట్రం నుంచే దేశం మొత్తానికి గంజాయి సరఫరా అవుతోందని, సరిహద్దు రాష్ట్రాలు రాష్ట్రంలో జరుగుతున్న దందాను ఎండగడుతున్నాయి. ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, బెంగళూరు, కేరళ సహా పలు ప్రాంతాల్లో పట్టుబడిన గంజాయి.. ఏపీ నుండే ఎగుమతి అయినట్లు అక్కడి పోలీసులు గుర్తించారు.

ఒక్క గంజాయే కాదు, ‎ హెరాయిన్‌, కొకైన్‌ వంటి భయంకర మత్తు పదార్ధాల మాఫియా రాష్ట్రంలో విచ్చలవిడిగా చెలరేగిపోతోంది. దేశంలో ఏ మూలన గంజాయి పట్టుబడ్డా , దాని మూలాలు ఏపీలో బయటపడుతున్నాయి. గతంలో బెంగుళూరులో కస్టమ్స్ అధికారులు ఓ పార్సిల్ ను పరిశీలించగా 4.49 కిలోల ఎఫిడ్రిన్ అనే మత్తు పదార్దం దొరికింది. ఇది విజయవాడ భారతీ నగర్ లోని కొరియర్ సంస్ధ నుంచి, ఆస్ట్రేలియాకు వెళ్తున్నట్టు గుర్తించారు.

ఇలా ప్రతి రోజు ఎక్కడో ఒకచోట ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో పట్టుబడ్డ గంజాయి ఏపీ నుంచే వెళ్తున్నట్టు అక్కడి పోలీసు అధికారులు చెబుతున్నారు. చివరకు ఏపీ నుంచి గంజాయి, మత్తు పదార్ధాలు కొరియర్ ద్వారా ఆన్ లైన్ షాపింగుల ద్వారా విదేశాలకు సైతం రవాణా జరుగుతోందంటే, పాలనలో నిఘా ఏవిధంగా పనిచేస్తుందో స్పష్టమవుతోంది. గతంలో గుజరాత్ ముంద్రా పోర్టులో ఆఫ్ఘనిస్తాన్‌ నుండి ఇరాన్‌ ద్వారా బెజవాడలోని ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ పేరుతో రవాణా చేస్తున్న 72 వేల కోట్ల హెరాయిన్ పట్టుబడింది.

టీడీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి అనే పదమే వినిపించకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటే.. నేడు రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్, నకిలీ మద్యం మాఫియాలకు అడ్డాగా మార్చి ప్రజల్ని దోచుకుంటున్నారు. గంజాయి, డ్రగ్ మాఫియా ఆగడాలను అరికట్టాలంటే టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి అధికారంలోకి రావాలి. అప్పుడే మన యువత భవిష్యత్ బంగారుమయవుతుంది, రాష్ట్రం అభివృద్దిలో దేశంలోనే నెం.1 స్ధానంలో ఉంటుంది. యువత కుల,మత,ప్రాంతీయ రొచ్చులో పడకుండా విజ్నతతతో ఆలోచింది. తమ ఓటు ద్వారా తమ భవిష్యత్ ను బంగారు మయంగా మార్చుకోవాలి.

LEAVE A RESPONSE