హైదరాబాద్.. చెన్నై… బెంగుళూరు.. పులివెందుల.. ఇడుపుల పాయ..తాడేపల్లిలో ఉన్న రాజభవనాలు నీకు సరిపోలేదా జగన్ రెడ్డి?
– రూ.433కోట్ల ప్రజలసొమ్ముతో రుషికొండపై తన విలాసాల కోసం భారీప్యాలెస్ నిర్మించుకుంటున్న జగన్ రెడ్డి
• రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపాల్సిన ముఖ్యమంత్రి.. ప్రజలసొమ్ముతో విలాసాలు చేయడం ఈ రాష్ట్రంలోనే చూస్తున్నాం
• ప్రజలసొమ్ముతో విలాసాలు అనుభవిస్తున్న జగన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఆ ప్రజలే గట్టిగా బుద్ధిచెబుతారు
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప
రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపాల్సిన ముఖ్యమంత్రే.. .ప్రజలసొమ్ముతో విలాస వంతమైన జీవితం గడపడం ఈ రాష్ట్రంలోనే చూస్తున్నామని, ప్రకృతి వనరుల దోపిడీపై జగన్ రెడ్డికి ఉన్న మోజు ఇంకా తీరలేదని, తన దోపిడీని మరింత యథేచ్ఛగా కొనసాగించడానికి ఆయన విశాఖపట్నంలో మకాం పెట్టబోతున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“ ప్రజారాజధాని అమరావతిని విధ్వంసం చేసిన జగన్ రెడ్డి … మూడు రాజధానుల నాటకమాడి చివరకు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. మూడు రాజ దానుల ముసుగులో తన పార్టీ వారితో రాష్ట్రవ్యాప్తంగా భూకబ్జాలు చేయించిన జగన్ రెడ్డి, తన దోపిడీని ఇకపై విశాఖ కేంద్రంగా కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఆ క్రమంలో విశాఖపట్నంలోని రుషికొండపై రూ.433కోట్లతో విలాస వంతమైన భారీ భవనాన్ని నిర్మింపచేస్తున్నాడు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వక పోవడంతో రాష్ట్రంలో ఎవరూ రోడ్లు వేయడానికి మరమ్మతులు చేయడానికి ముందుకు రావడంలేదు.
మరోపక్క ఆరోగ్యశ్రీ బిల్లుల తాలూకా బకాయిలు ఆసుపత్రులకు దాదాపు రూ.1000కోట్లవరకు బకాయి పెట్టడంతో పేదలకు వైద్య సేవలు నిలిచిపోయే పరిస్థితి. ఇలా రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చే అనేక రకాల చెల్లింపులు పక్కన పెట్టిన ముఖ్యమంత్రి తన విలాసాలకోసం ఏకంగా రూ.450 కోట్లవరకు ప్రజలసొమ్మును దుర్వినియోగం చేయడానికి సిద్ధమవ్వడం నిజంగా బాధాకరం.
రుషికొండపై జగన్ రెడ్డి నిర్మింపచేస్తున్న భారీ రాజ భవన నిర్మాణ బిల్లుల వివరాలు ఆన్ లైన్లో పెట్టకపోవడంపై న్యాయస్థానాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి
పర్యాటక ప్రదేశమైన రుషికొండను తన నివాసానికి అనుకూలంగా జగన్ రెడ్డి మార్చుకోవడం ముమ్మాటికీ చట్టవిరుద్ధమే. అలానే రుషికొండపై తన విలాస జీవనంకోసం ముఖ్యమంత్రి నిర్మించుకుంటున్న రాజభవనం నిర్మాణానికి సంబం ధించిన సమాచారాన్ని ప్రజలముందు పెట్టకుండా దాచిపెడుతున్నాడు. నిర్మాణ ఖర్చుల తాలూకా బిల్లులను ఆన్ లైన్ లో ఉంచకపోవడంపై న్యాయస్థానం ప్రభు త్వానికి అక్షింతలు వేసింది. దాంతో పనుల్ని చిన్నవిగా విడగొట్టి.. చిన్న మొత్తాల బిల్లుల వివరాలు అంటే రూ.100కోట్లు.. ఆ లోపు పనులకే టెండర్లు పిలిచి ప్రభుత్వం రుషికొండపై జగన్ రెడ్డి రాజభవనాన్ని నిర్మిస్తోంది. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా రుషికొండపై ముఖ్యమంత్రి నివాసంకోసం భవననిర్మా ణం సాగుతోంది.
ప్రజల సొమ్ముతో విలాసవంతమైన భవనాలు నిర్మించుకుంటున్న జగన్ రెడ్డికి వచ్చేఎన్నికల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పాలి
జగన్ రెడ్డికి ఇప్పటికే హైదరాబాద్ లో లోటస్ పాండ్ (రూ.200కోట్ల విలువైన రాజభవనం), బెంగుళూరులోని ఎలహంకలో మరో భారీ ప్యాలెస్ (రూ.350 కోట్ల విలువ) ఉన్నాయి. వాటితో పాటు చెన్నై, ఇడుపుల పాయ, తాడేపల్లిలో కూడా భారీ భవనాలు నిర్మించుకున్నాడు. అవిచాలవన్నట్టు ఇప్పుడు మరలా రుషికొం డపై పర్యాటక భవనాల్ని నేలమట్టం చేసి మరీ తన రాజభవనాన్ని నిర్మించుకుం టున్నాడు. తన సుఖసౌఖ్యాలు… రాజభోగాల కోసం జగన్ రెడ్డి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి తీరుని.. నియంత్రత్వ పోకడల్ని ప్రజలు, ప్రతిపక్షాలు గమనించి, వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధిచెప్పాలి.” అని చినరాజప్ప సూచించారు.