– విమర్శలతో పోలీసులు బాధపడుతున్నారు
– టీడీపీ నేతల విమర్శలపై డీఐజీ త్రివిక్రమవర్మ ఆవేదన
పోలీసులను బానిసలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై గుంటూరు రేంజ్ డిఐజీ త్రివిక్రమవర్మ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు బానిసలంటూ టీడీపీ నేతలు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్న ఆయన.. మరి మాజీ సీఎం చంద్రబాబునాయుడు బందోబస్తులో 150 మంది పోలీసులున్నారు. ఆ ప్రకారం వారు కూడా బానిసలేనా?’ అని డీఐజీ ప్రశ్నించారు. పోలీసులపై రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలు వారిని బాధిస్తున్నాయన్నారు. డీఐజీ ఏమన్నారంటే…<
కంతేరులో గొడవ జరిగింది.సునీత, వంశీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ ఫిర్యాదు చేసిన దానిపై కేసులు నమోదు చేశాం. రెండు కేసుల్లో అరెస్టులు చేశాం.దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు జరుగుతున్నప్పుడు శాంతిభద్రతలు సమస్య తలెత్తేలా గ్రామానికి వెళతామనడం కరెక్ట్ కాదు. దుగ్గిరాలలో రాళ్ళ దాడి జరిగిన విషయం తెలిసిందే. వెంకాయమ్మ ఇంటి వద్ద పికెట్ పెట్టాం.దుర్గిలో ఒకరి హత్య జరిగింది. వెంటనే ఆ హత్య కేసులో అరెస్టులు చేశాం.
ఈ ఘటనను రాజకీయ చేయడం ఎంత వరకూ సమంజస? పోలీసులు వైసీపీ బానిసలా అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించినా దాఖలాలు ఉన్నాయా?మాజీ సిఎం బందోబస్తు లో 150 మంది పోలీసులు ఉన్నారు. వారు బానిసలా? అన్ని రాజకీయ పార్టీలకు పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. పోలీసులు ఇరవై నాలుగు పనిచేస్తున్నా కించపరిచేలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇటువంటి వ్యాఖ్యలతో పోలీసులు బాధపడుతున్నారు.
ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ ఏమన్నారంటే…
కంతేరు ఘటనలో రెండు కేసులు నమోదు చేశాం. దర్యాప్తు చేస్తున్నాం. ఇరువురుతోనూ మాట్లాడాను. పిఎస్ వద్దకు స్వయంగా నేను వెళ్ళాను. సునీత, వంశీ మధ్య జరిగింది వ్యక్తిగతమైన గొడవ. సీసీ కెమెరాలు విజువల్స్ కూడా ఉన్నాయి.