Suryaa.co.in

Telangana

ఆ రాష్ట్రాలలో ఎక్కడైనా రెండు వేల రూపాయల పెన్షన్లు ఇస్తున్నారా?

దేశాన్ని పాలిస్తున్న బిజెపి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ రాష్ట్రాలలో ఎక్కడైనా రెండు వేల రూపాయల పెన్షన్లు ఇస్తున్నారా…? ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో 46 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం, ఇప్పుడు 10 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.

కూకట్ పల్లి నియోజకవర్గం లోని ఫతేనగర్ డివిజన్లో ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రివర్యులు హరీష్ రావు హాజరై లబ్ధిదారులకు ఆసరా కార్డులను ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ తో పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన 8 సంవత్సరాలలో కూకట్పల్లి నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని వేల మందికి సంక్షేమ పథకాలు అందించి తనను గెలిపించిన రుణం తీర్చుకున్నానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

మంత్రివర్యులు హరీష్ రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందిస్తుంటే…బిజెపి, కాంగ్రెస్ మాత్రం పాదయాత్రలు సైకిల్ యాత్రలు, మోకాళ్ళ యాత్రలు అంటూ ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. బిజెపి, కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాలలో ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి చేశారా.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు అందిస్తున్నారా అని ప్రశ్నించారు. బిజెపి పాలిస్తున్న డబల్ ఇంజన్ సర్కార్ మహారాష్ట్రలో 2016 రూపాయల పెన్షన్లు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిస్తున్న ఛత్తీస్గడ్ లో ఎంత పెన్షన్లు ఇస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 24 గంటల కరెంటు, ఇంటింటికి మంచినీళ్లు అందిస్తూ ప్రజల కష్టాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చారన్నారు. కల్లబొల్లి మాటలతోనే కాంగ్రెస్ , బిజెపి పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నయి.. తప్ప ప్రజల కష్టాలను మాత్రం ఏ మాత్రం పట్టించుకోవట్లేదు అని మంత్రి హరీష్ రావు అన్నారు. అతి తొందరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా డబల్ బెడ్రూంలో అందజేస్తామన్నారు.

LEAVE A RESPONSE