– ఉద్యోగులు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు.
– సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే మళ్లీ టీడీపీ గెలవాలి
– కుప్పంలో రెండవరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన
– చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరిన కాంగ్రెస్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. సురేష్, అతని అనుచరులు
వైసీపీ,కాంగ్రెస్‌నుంచి వందలాది మంది కార్యకర్తలు టీడీపీలో చేరిక
అనంతరం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏమన్నారంటే..
తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కుప్పంలో టీడీపీ జెండా ఎగురుతూనే ఉంది. నియోజకవర్గం అభివృద్ది కావాలన్నా, మన పిల్లలు భవిష్యత్ బాగుండాలి అన్నా టీడీపీనే గెలవాలి. నేడు పార్టీ లో చేరుతున్న వారిని మనస్పూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నా….అందరూ కలిసి వచ్చే ఎన్నికల్లో కుప్పంలో లక్ష మెజార్టీ దిశగా పనిచేయాలి.
రాష్ట్రంలో కుప్పం నియోజకర్గం అంటే ఒక గౌరవం ఉంది. సురేష్ తండ్రి దొరస్వామి నేను ఒకే సారి ఎమ్మెల్యేలయ్యాం. సంపద సృష్టించటం ఆ సంపదను పేదలకు పంచడం తెలిసిన పార్టీ టీడీపీ. రెండు రూపాయలకే కిలో బియ్యం, పక్కా ఇళ్ల నిర్మాణం, జనతా వస్త్రాలు వంటి సంక్షేమం పధకాలకు నాంది పలికిన పార్టీ టీడీపీ.ఐటీనీ అందిపుచ్చుకుని సంపద సృష్టించాం.
వైసీపీ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారు. నీతి నిజాయితీకి మారు పేరు కుప్పం ప్రజలు, నేడు ఇక్కడ రౌడీలు పేట్రేగిపోతున్నారు, నా దగ్గర మీ రౌడీయిజం చెల్లదు.తీవ్ర వాదులపై పోరాడిన పార్టీ, రౌడీలను తుదముట్టించిన పార్టీ టీడీపీ. కుప్పంలో వైసీపీ గూండాలు బహిరంగా ఒక వ్యక్తిపై దాడులు చేయటం ఓ వీడియోలో చూసి చలించిపోయా, అసలు వీళ్లు మనుషులా రాక్షసులా?
పేదలను ధనికుల్ని చేసే బాధ్యత తీసుకుంటాం. నాడు దీపం పధకం గ్యాస్ సిలిండర్ లు ఇచ్చాం. కాలేజీ సీట్లలో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చి మగవారితో సమానంగా ప్రోత్సహించాం.ఆడిబిడ్డల్ని మహాశక్తిగా రూపొందిచేందుకు మహాశక్తి పధకం తెచ్చాం. ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.
18- నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తాం.
ఇంట్లో ఎంతమంది చదువకునే పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం కింద ఏడాదికి రూ. 15 వేలిస్తాం. యువతకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.రైతులకు ఏడాదికి రూ. 20 వేలు అందజేస్తాం.బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. కుళాయి ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తాం.పి – 4తో పేదల్ని ధనికులుగా చేస్తాం.
ఇక్కడ 95 శాతం పూర్తైన హంద్రీనీవా పూర్తి చేయలేకపోయారు, నేనుంటే 3 ఏళ్లలోనే పూర్తి చేసి నీళ్లిచ్చేవాడిని. ద్రవిడ యూనివర్సిటీ ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్దితి లో వైసీపీ ప్రభుత్వం ఉంది. ఉద్యోగులు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు.
సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే మళ్లీ టీడీపీ గెలవాలి. ఎన్నికలు మరో 9 నెలలే ఉన్నాయి, మీరంతా ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేయండి, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత టీడీపీది. గత 35 ఏళ్లలో నియెజకవర్గంలో జరిగిన అభివృద్ది వచ్చే 5 ఏళ్లలో చేసి చూపిస్తా.