Suryaa.co.in

Telangana

రైతులకు బేడీలు వేసి తీసుకువెళ్ళడానికి వాళ్లేమైనా ఉగ్రవాదులా?

– నాటకాలు కట్టిపెట్టి.. ప్రజాపాలన సాగించాలి
– రేవంత్‌ పై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఆగ్రహం

హైదరాబాద్: లగచర్ల రైతులను జైళ్లో పెట్టడమే కాకుండా గిరిజన రైతు గుండెనొప్పితో ఆసుపత్రి తీసుకెళ్లమంటే బేడీలు వెళ్లి తీసుకెళ్లిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది. ఇది చాలా దుర్మార్గమైన చర్య దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతు రాజ్యం తెస్తామన్న రేవంత్‌ రెడ్డి.. ఇవాళ్టి ఘటనతో రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు. యావత్‌ తెలంగాణ సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.

సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు రేవంత్‌ రెడ్డి నాటకం ఆడుతున్నారు. నాటకాలు కట్టిపెట్టి.. ప్రజాపాలన సాగించాలి. రైతులకు బేడీలు వేసి తీసుకువెళ్ళడానికి వాళ్లేమైన ఉగ్రవాదులా? ఉగ్రవాదులను, సంఘవిద్రోహ శక్తులను జైలుకు తీసుకుపోయినట్టు మరీ అంత దారుణంగా అన్నదాతలను బేడీలు వేసి తీసుకుపోవడం దుర్మార్గం, ఇది నిరంకుశత్వానికి నిదర్శనం.

ఆ రైతుకు గుండెపోటు వచ్చిందని తెలిసి కూడా బేడీలు వేసి తీసుకుపోవడం ఏంటి కనీసం ఆసుపత్రి కి కూడా బేడీలు వేసి తీసుకువెళ్ళడం ఏంది? దీన్ని చూసి తెలంగాణ సమాజం ఆగ్రహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తుంది. గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం కుడా ఖమ్మం జిల్లా రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీ ఆర్ ఎస్ ప్రభుత్వానికి తేడా లేదు. దీనిపై మానవ హక్కుల సంఘాలు స్పందించాలి.

LEAVE A RESPONSE