– రైతుకు బేడీలు వేసిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం
– బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి& బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఇంచార్జ్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది అనడానికి నేడు రైతుకు బేడీలు వేసి తీసుకపోవడమే నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వ చర్యను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తున్న తీరు తెలంగాణ ప్రజలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆంక్షలు విధించే చర్యలు సరైనవి కాదు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల, పేదల పట్ల, విద్యార్థుల పట్ల, యువత పట్ల నిరంకుశంగా నియంత పోకడలతో వ్యవహరిస్తుంది అనడానికి అనేక సంఘటనలు జరిగినవి. పునరావృత్తమవుతున్నాయి .
ఈ సంఘటన తనకు సంబంధం లేదన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కానీ భూసేకరణ విషయంలో రైతులు నిరసన తెలియజేస్తే ముఖ్యమంత్రి మాట్లాడిన భాష వ్యవహరించిన తీరు అధికారులు ప్రేరణగా, భవిష్యత్తులో విధివిధానాలను రూపొందించుకునేలా పోలీస్ యంత్రాంగం భావించారు.
పోలీస్ యంత్రాంగం కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నట్లు వ్యవహరించకుండా కొన్ని సందర్భాలలో రైతుల పట్ల, కార్మికుల పట్ల, విద్యార్థుల పట్ల, యువత పట్ల సానుభూతి మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. వారు అనేక బాధలలో ఉండి ప్రభుత్వ చర్యలను నిరసిస్తున్నారు తప్ప ఎవరిపైన ద్వేషం కాదు.
నేడు రాష్ట్రంలో గతంలో పరిపాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం నిరసన ప్రదర్శన పట్ల వ్యవహరించిన తీరు నేడు కాంగ్రెస్ పార్టీ కూడా, అదే విధంగా వ్యవహరిస్తూ తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. ఎవరు రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండ కట్టకూడదు అనే రీతిలో వ్యవహరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తెలంగాణ ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సభ్య సమాజం బాధపడేలా అన్నం పెట్టే రైతుకు బేడీలు చరిత్ర గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వానిది. నేడు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అడుగుజాడల్లో నడుస్తూ ముందు ముందు ఎవరు నిరసన ప్రదర్శన చేయకూడదనే నియంతృత్వ ధోరణి సరికాదు.నేడు రైతుకు బేడీలు వేసిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిరంతరం సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుంది.