అడవుల్లో ఎర్రచందనం నరిే స్తున్నా పట్టించుకోరా?
అందులో జంతువులు జనంలోకి వస్తున్నాయి
విదేశాల్లో ఉన్న 29 మంది అవినీతిపరులు మోడీ దత్తపుత్రులే
సిపిఐ బహిరంగ సభలో జాతీయ కార్యదర్శి నారాయణ
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలక మండల సభ్యులు సారా అమ్మే వాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్లు సభ్యులుగా ఉన్నారు.ఇది ప్రభుత్వం తీరు దీనిపై సిపిఐ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అడవుల్లో ఎర్రచందనం నరికేస్తుంటే, దాన్ని కాపాడుకునేందుకే అడవి జంతువులు జనబాహుళ్యంలో వస్తున్నాయి.
అడవిలో స్మగ్లర్లను తరిమి కొట్టండి. జంతు వులకు రక్షణ కల్పించండి. ఇది టీటీడీ చైర్మన్ కి తెలియదా? రాష్ట్రంలో 60,70 వేల కోట్ల అవినీతిపరుడు సీఎం ఉండగా, 118 కోట్ల అవినీతిపరుడు చంద్రబాబుని అరెస్టు చేయాలని వైసిపి నాయకులు మంత్రులు పేర్కొనడం హాస్యాస్పదం.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రిటైల్ అవినీతికీ పాల్పడితే, నేడు కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి వైసిపి ప్రభుత్వం హోల్సేల్ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
విదేశాల్లో ఉన్న 29 మంది అవినీతిపరులు మోడీ దత్తపుత్రులే. వారిని ప్రోత్సహిస్తున్న ప్రధాని కూడా అవినీతిపరుడే.మోదీ గ్రాఫ్ రోజు రోజుకి దిగజారుతుంది. చివరకు జి20 సమావేశాలను కూడా బిజెపి ప్రభుత్వం, ఎన్నికల ప్రచారానికివాడుకుంటుంది.మోడీ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తుంది.