-ఎస్సీ, ఎస్టీల అసైండ్ భూములు లాక్కోవటం సామాజిక న్యాయమా?
-ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పోరేషన్ రుణాలు రద్దు చేయటం సామాజిక న్యాయమా?
-చంద్రబాబు, లోకేశ్ ను చూసి వైసీపీ నేతలు నిద్రలో కూడా భయపడుతున్నారు
-ఇప్పుడు హద్దు మీరి ప్రవర్తిసున్న వైసీపీ నేతలకు టీడీపీ అధికారంలోకి వచ్చాక తబిడిదిబిడే
-2024లో జగన్ రెడ్డి పులివెందులలో ఓడిపోవటం ఖాయం
– పీతల సుజాత
సామాజిక న్యాయం చేశామంటూ వైసీపీ మంత్రులు డబ్బాలు కొడుతున్నారని, వారు చేసిన సామాజిక న్యాయం ఏంటో బహిరంగ చర్చకు సిద్దమా అని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…
వైసీపీ నాయకులు, మంత్రుల అంతా సామాజిక న్యాయం అంటూ జపం చేస్తున్నారు. కానీ వైసీపీ చేస్తోంది సామాజిక న్యాయం కాదు, సామాజిక విద్రోహం. వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు జరిగిన న్యాయం కంటే జరిగిన అన్యాయమే ఎక్కువ. దీనిపై ఎక్కడైనా చర్చకు టీడీపీ సిద్ధం. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 11వేల ఎకరాల అసైండ్ మెంట్ భూములు లాక్కోవటం సామాజిక న్యాయమా? దళితులకు పారిశ్రామిక రాయితీల్లో కోత కోయడం వైసీపీ సామాజిక న్యాయమా? బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయకుండా మూడు సంవత్సారాల నుంచి నిలిపివేయడం, డా.బి.ఆర్. అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని ఆపేసి దళితులు చదువుకుంటున్న విదేశీ విద్యకు అన్యాయంగా బిల్లులు ఇవ్వకుండా వాళ్ళ చదువుకు ఆటంకం కలిగించడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చెందిన సబ్ ప్లాన్ నిధులు దాదాపు రూ. 35వేల కోట్ల రూపాయలు దారి మళ్ళించడం, బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళను రద్దు చేయటం ఇదేనా వైసీపీ చేసిన సామాజిక న్యాయం. మద్య నిషేధం అని చెప్పారు కానీ నేడు అదే మద్యంపై వచ్చే ఆదాయంతో మహిళల మాంగళ్యాలను తాకట్టు పెట్టి 35వేల కోట్లు అప్పు చేశారు. ఇంత దుర్మార్గపు చర్యలు చేసిన వైసీపీ కి సామాజిక న్యాయం అంటే ఏంటో తెలుసా? సామాజిక న్యాయం పేరుతో బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు మీద దాడులు చేస్తున్నారు. టీడీపీ మాత్రమే సామాజిక న్యాయం చేస్తుంది.
టీడీపీ హయాంలో ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు రద్దు చేశారు. చంద్రబాబు నాయుడు ఎస్సీలకు కార్లు ఇచ్చి డ్రైవర్లను ఓనర్లుగా చేశారు. సబ్సిడీకి రుణాలిచ్చి స్వయం ఉపాధి కల్పించి వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు, టీడీపీ ప్రభుత్వానిది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాలలో ఒక్క కారు ఇచ్చారా, దళితులకు ఒక్క లోన్ అయినా ఇచ్చారా? వైసీపీ ప్రభుత్వం డ్రైవర్లకు రూ.10,000లు ఇచ్చినట్టే ఇచ్చి, రూ.20,000లు జరిమానాలు విధించి, డ్రైవర్ల పొట్ట గొడుతున్నారు. రాష్ట్రంలో రోడ్లు ఎక్కడా సరిగాలేవు. భయంకరంగా రోడ్డు మధ్యలో గోతులు, వర్షం పడితే రోడ్డు పై ప్రయాణించే వాళ్ళు ఎక్కడ ఏ ప్రమాదానికి గురి అవుతారో కూడా తెలియని పరిస్థితి. చాలా మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి భయకరంగా ఉన్న రోడ్ల మీద ప్రయాణిస్తున్న కార్లు రిపేర్లకు గురవుతున్నాయి. ఆ వాహనాలకు జరిమానాలు విధించి ఇచ్చింది రూ. 10వేలు అయితే 20 వేలు అర్జించి పేదవాడి కడుపు మీద కొడుతున్నారు. అమ్మఒడితో రూ.13000లు ఇచ్చి నాన్న బుడ్డితో రూ.70,000లు గుంజుతున్నారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా? చంద్రబాబు నాయుడు హయాంలో 82 లక్షల మంది స్టూడెంట్స్ కు ఫీజు రియింబర్సమెంటు ఇస్తే దాన్ని వైసీపీ కోత విధించి 13 లక్షల మందికే అమ్మఒడిని పరిమితం చేశారు. వైసీపీ సంక్షేమ పథకాలు పేరుతో ప్రజలను మభ్యపెడుతుంది. టీడీపీ 35సంవత్సరాలకే ఒంటరి మహిళలకు పెన్షన్లను ఇస్తే దాన్ని 50 సంవత్సారాలకు పెంచి వాళ్లకు ద్రోహం చేసింది. రాష్ట్రానికి తెస్తున్నఅప్పులన్నింటిని సంక్షేమ పథకాల పేరుతో వైసీపీ భకాసురులే తినేస్తున్నారు. 5లక్షల కోట్లు అప్పులు చేశారు, కానీ సంక్షేమ పధకాల కోసం కేవలం రూ. లక్షా 50వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. మిగతా డబ్బులు ఏం చేశారో ప్రజలకు చెప్పాలి. ల్యాండ్,శాండ్, వైన్, మైన్ ప్రతీ దాంట్లోనూ వైసీపీ నేతలు దోచుకుంటున్నారు.
ఇవన్నీ టీడీపీ ప్రజల ముందు భయటపెడుతుందన్న అక్కసుతో వైసీపీ అసత్య ప్రచారాలు చేయడం మొదలు పెట్టింది. టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అన్ని కోత కోస్తారు, తీసేస్తారు అని అసత్య ప్రచారం వైసీపీ లేవనెత్తింది. ప్రజలందరు టీడీపీ కి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారని వైసీపీ నేతలకు అర్థమైంది. అందుకే అభద్రతా భావంతో తెలుగుదేశం పార్టీ పై నిందలు వేసి ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతారని మంత్రి మేరుగ నాగార్జున అంటున్నారు. ముఖ్యమంత్రి పులివెందుల వెళ్ళినపుడు మొత్తం బంద్ చేశారు, జగనె వెళ్ళే దారి పొడుగున బారీకేడ్లు ఎందుకు పెట్టారు. పరదాల చాటున వెళ్ళాల్సిన అవసరం జగన్ కి ఎందుకు వచ్చింది? దర్జాగా ఎందుకు వెళ్ళలేకపోయారు? ఊరంతా ఖాళీ చేయించి భద్రతా సిబ్బంది ఉంటే గాని పులివెందుల వెళ్ళలేని పరిస్థిలతులలో జగన్ రెడ్డి ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కుప్పం వెళితే అధికారం లేకపోయిన, అధిక వర్షం వస్తున్న ప్రజలు కుప్పలు తెప్పలుగా ఆహ్వానం పలుకుతున్నారు. దీన్ని బట్టే అర్ధమవుతుంది ఎవరికి ప్రజాబలం ఉందో. నియోజకవర్గం మారాలని ఎవరు భయపడుతున్నారు, చెల్లిని ఎవరు బతిమాలుతున్నారో ప్రజలందరికి తెలుసు. సామాజిక న్యాయం చేయాలనుకుంటే పెద్ది రెడ్డిని తీసి ఆ స్దానంలో ఎస్సీ, బీసీలకు ఇవ్వండి. అంతే తప్ప సుచరితను తోలగించి వనితకు ఆ స్ధానం ఇవ్వటం సామాజిక న్యాయం కాదు. సామాజిక న్యాయం మీరు కొత్తగా ఇచ్చేందేంటి… డా.బి.ఆర్. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపర్చారు అది ఎవరైనా అమలు చేసి తీరాలి.
వైసీపీ నిజంగా సామాజిక న్యాయం చేయదలచుకుంటే జనరల్ సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వాళ్ళకు ఇవ్వగలరా? రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేసి జగన్ తన సామాజిక వర్గం వారి చేతుల్లో పెట్టారు. 59 కార్పొరేషన్లను తూతూమంత్రంగా వేశారు. వాళ్లు కూర్చుంటానికి కుర్చీలు కూడ లేవు, సరైన గుర్తింపు, గౌవరవం కూడ దక్కడం లేదు, ప్రోటోకాల్ లేదు, సరైన జీతం లేదు కార్పొరేషన్ల చైర్మన్లకు. మీ లోటుపాట్లు ఏంటి అని కార్పొరేషన్ల చైర్మన్లను అడిగారా. టీడీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్ని తీసేసి కొత్త పేర్లు పెట్టి ప్రజలకు మీరు చేసింది ఏముంది. ప్రజలకు సామాజిక న్యాయం జరిగింది చంద్రబాబు నాయుడు వల్లే ఇక ముందు కూడ చంద్రబాబు వల్లే సామాజిక న్యాయం జరుగుతుందని ప్రజలు కూడ తెలుసుకుంటున్నారు. ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఒక బీసీ, తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఒక ఎస్సీ. కానీ వైసీపీకి శాశ్వత అద్యక్షుడు జగన్ రెడ్డా? మిగతా కులాలు అధ్యక్షులుగా ఉండకూడదా?
చంద్రబాబు, లోకేశ్ ను చూసి వైసీపీ నేతలు నిద్రలో కూడా భయపడుతున్నారు. ఇప్పుడు హద్దు మీరి ప్రవర్తిసున్న వైసీపీ నేతలకు టీడీపీ అధికారంలోకి వచ్చాక తబిడిదిబిడే 2024లో జగన్ రెడ్డి పులివెందులలో ఓడిపోవటం ఖాయమని పీతల సుజాత అన్నారు.