Suryaa.co.in

Andhra Pradesh

ప్లీనరీ విజయంతో బాబుకు ఫ్యూజులు ఎగిరిపోయాయి

-అమరావతి భూ దందాలో లక్షల కోట్లు దోచుకున్న చంద్రబాబు
-బ్యాంకులు లూటీ చేసిన వారందరికీ చంద్రబాబే రక్షకుడు
-ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి

వైఎస్అర్ సిపి ప్లీనరీ ఘనవిజయంతో ఫ్యూజులు ఎగిరిపోయి చంద్రబాబు ఇక  చేసేదేమీలేక తన పెంపుడు కుక్కలన్నిటినీ గొలుసులు విప్పి ఒక్కసారిగా వదిలాడని, దీంతో అవి పోటీ పడి మొరుగుతున్నాయని రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. ప్లీనరీ విజయాన్ని జీర్ణించుకోలేక ప్రభుత్వంపైనా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు, ఇతర తేదేపా నేతలపై ఆయన తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. వానా కాలం శునకాలకు పిచ్చి ఎక్కే సీజన్ అని,  ప్రజలే ఈ కుక్కల్ని తరిమికోడతారని అన్నారు.

అలుపు లేకుండా అబద్ధాలు గుప్పించడానికి అల్జీమర్స్ బాబు (చంద్రబాబు) కు కనీసం సిగ్గుగా అనిపించడంలేదని ఏవరో చేస్తున్న బిజినెస్ ని వేరే ఎవరికో అంటగట్టడం బాబుకు అలవాటుగా మారిందని అన్నారు. అమరావతి భూ దందాలో లక్ష కోట్లు దోచుకున్నోడికి అందరూ తనలాగే కనిపిస్తుంటారని చంద్రబాబుపై మండిపడ్డారు. హెరిటేజ్ ఫ్రెష్ ను కొన్న కంపెనీ ఎందుకు మటాష్ అయిందో చంద్రబాబు చెప్పాలని అన్నారు.

రుణాల పేరుతో లక్ష కోట్లు లూటీ చేసిన వారందరికీ చంద్రబాబే రక్షకుడని, ఏ పార్టీలో చేరితే వారిపై ఈగ వాలదో అలా వారందరినీ సెట్ చేసి కాపలా కాస్తున్నాడని అన్నారు. ఎగ్గొట్టిన సొత్తులో బాబుకు కమిషన్లు ముట్టాయని అన్నారు.  బ్యాంకుల లూటీ గురించి మాట్లాడకుండా సూటుకేసు, గోనె సంచి కంపెనీలని మొరిగిస్తున్నాడని అన్నారు.

డీఎంకే శాశ్వత అధ్యక్షునిగా కరుణానిధి  ఎన్నికైనప్పుడు ఉదయించే సూరీడంటూ ఇదే పచ్చ మీడియా ఆయనను ఆకాశానికెత్తిన విషయాన్ని గుర్తుచేశారు. విలువలు పాతాళానికి పడిపోయిన పచ్చ కుల మీడియా కు ఇప్పుడు ఇది తప్పుగా కనిపించడం దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు.

LEAVE A RESPONSE