ముగ్గురు యువకులు సరదాగా ట్రెక్కింగ్ చేస్తూ కొండెక్కారు.దుర్భేద్యమైన ఆ కొండను ఎక్కడంలో సాధ్యం కాదని ఇద్దరు మిత్రులు వెనుదిరిగారు. కానీ ఓ యువకుడు మాత్రం పట్టు వదల్లేడు. పూర్తిగా ఎక్కాల్సిందేనని భావించాడు. చివరకు విజయవంతంగా ఆ కొండ పైభాగానికి చేరుకున్నాడు.కానీ, దురదృష్టవశాత్తు అతడి కాలు జారి కిందికి జారిపోయాడు. పక్కనే లోయలా ఉన్న దానిలో పడిపోయాడు. చివరకు కొన్ని రాళ్ల మధ్య ఇరుక్కుని కొట్టుమిట్టాడే పరిస్థితి చేరుకున్నాడు. ఆ ప్రాంతం ఎలా ఉందంటే.. సహాయక చర్యలు అందించడం కూడా సాధ్యం కావడం లేదు.
నేవీకి చెందిన హెలికాప్టర్ రంగంలోకి దిగినా.. ఆ యువకుడిని వెనక్కి తీసుకురాడం సాధ్యం కావడంలేదు. కొండల మధ్య చిక్కుకున్న విషయం సీఎం, అతడిని రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని సైన్యాన్ని కోరారు. దీంతో బెంగళూరు నుంచి ప్రత్యేక దళాన్ని పంపుతున్నట్లు సదరన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ అరుణ్ తెలిపారు.కేరళ-పాలక్కడ్‌లో ఓ యువకుడు రాళ్ల మధ్యలో చిక్కుకుని 24గంటలు దాటి పోయింది.ఇప్పటికీ అక్కడే ఉండిపోయాడు.అతడి కాలుకు తీవ్ర గాయం అయినట్లు ఫొటోలను పంపించాడు. రెండు రోజులుగా ఆ యువకుడిని కాపాడటానికి రెస్కూ సిబ్బంది ప్రయత్నిస్తునే ఉన్నారు.
ఎంతగా ప్రయత్నించినా యువకుడి వరకు సిబ్బంది చేరలేకపోయారు.దీంతో ఆర్మీ రంగంలోకి దిగింది. ఈ మేరకు తమిళనాడులోని వెల్లింగ్టన్ నుంచి మరో బృందం పాలక్కడ్‌కు చేరుకుంది. సహాయక చర్యల్లో భాగంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నుంచి పారా కమాండోలు సైతం వచ్చాయి.
కొండ నడుమలో గూడు లాంటి చోట కూర్చొని సాయం కోసం ఎదురుచూస్తున్న బాబును కాపాడేందుకు ఎన్డిఆర్ఎఫ్(NDRF) కూడా ప్రయత్నించింది. చివరకు 45 గంటల అనంతరం ఆర్మీ అతడిని సేఫ్ గా బయటకు తీసుకొచ్చింది.దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. తనను రక్షించినందుకు ఇండియన్ ఆర్మీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇండియన్ ఆర్మీకి జై, భారత్ మాతాకి జై అని యువకుడు చెప్పారు.