Suryaa.co.in

Telangana

బోనాలు వేడుకలు సాఫీగా సాగేలా ఏర్పాట్లు:పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ పరిధిలో బోనాలు వేడుకలు సాఫీగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు జరిపామని, పోలీసులు, నిర్వాహకులు కూడా సంయమనంగా వ్యవహరించి వేడుకలను జయప్రదం చేయాలని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. చిలకలగూడా చారిత్రాత్మక కట్ట మైసమ్మ దేవాలయంలో ఆదివారం బోనాలు వేడుకలు జరగనున్న నేపధ్యంలో శనివారం ఆలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏర్పాట్లను సమీక్షించారు. ఆలయం కార్య నిర్వహణాధికారి మహేందర్ గౌడ్, చిలకల గుడా ఇన్స్ పెక్టర్ నరేష్, బల్దియా వైద్యాధికారి డాక్టర్ రవీందర్, ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ భారత్ కుమార్, ఆలయం అధికారులు, నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

బోనాలు మహిళా భక్తులకు ఇబ్బంది కలుగ కుండా ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలనీ, రోడ్లు భవనాల శాఖ ద్వారా బ్యారికేడ్లు ఏర్పాట్లు జరపాలని ఆదేశించారు. చిలకల గుడా మున్సిపల్ గ్రౌండ్ లో వర్షపు నీటి వల్ల ఇబ్బంది కలుగ కుండా ఇంజినీరింగ్ అధికారులు ఏర్పాట్లు జరపాలని ఆదేశించారు. ట్రాఫిక్ చిక్కులు12A1169 నివారించేలా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ అధికారులను ఆదేశించారు. గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తున్న ఎల్ ఈ డీ ప్రదర్శనకు ఏర్పాట్లు జరపాలని ఆదేశించారు. మంచి నీటి సరఫరా లో ఇబ్బందులు నివారించాలని, రోడ్లు బురద మయంగా మారకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని దేవాలయాల వద్ద విధిగా పోలీసు సిబ్బందిని నియమించి బందో బస్తును పర్యవేక్షించాలని, సీ సీ కెమెరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనీ అధికారులను పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా ఆదేశించారు. సికింద్రాబాద్ లో ఘనంగా బోనాలు వేడుకలు జరిగేలా ఏర్పాట్లు జరపాలని కోరారు.

దళిత బంధు వాహనాలు ప్రారంభం

– ఒకే రోజు ఏడుగురు లబ్దిదారుల కుటుంబాలకు ప్రయోజనం
దళిత బంధు పధకంలో భాగంగా అడ్డగుట్ట డివిజన్ కు చెందిన అయోధ్య, నర్సింగ్,మరియు సుజాత లకు స్విఫ్ట్ డిజైర్ వాహనాలను ఉప సభాపతి పద్మారావు గౌడ్ అందచేశారు. సీతాఫల్మండి డివిజన్ కు చెందిన ఆనంద్ స్విఫ్ట్ వాహనాన్ని అందచేశారు. అదే విధంగా తార్నాక కు చెందిన కృష్ణవేణి,బలరాం,మరియు ప్రదీప్ కు మారుతి ఎర్టిగా వాహనాన్ని అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత బంధు పధకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోనేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెరాస కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, యువనాయకులు తీగుళ్ల కిషోర్ కుమార్ గౌడ్,కిరణ్ కుమార్ గౌడ్,రామేశ్వర్ గౌడ్ తెరాస డివిజన్ నాయకులు , తదితరులు నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE