Suryaa.co.in

Andhra Pradesh International National

ఉక్రెయిన్ నుంచి వచ్చే తెలుగు విద్యార్థులకు ఏర్పాట్లు

ఏపీ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్

ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకునే ఏపీకి చెందిన విద్యార్ధులకు అన్ని రకాల సాయం అందిస్తామని చెప్పారు. ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్ధులు, ప్రధానంగా ఏపీకి చెందిన విద్యార్థుల కష్టాలపై సీఎం జగన్ ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖతో చర్చిస్తున్నట్లు వివరించారు. ప్రవీణ్ ప్రకాష్ ఏమన్నారంటే…
ఢిల్లీ చేరుకున్న తర్వాత భోజన,వసతి, రవాణా సదుపాయం. ఇంటికి పంపేవరకు పూర్తి బాధ్యత
praveen-ap1 తీసుకుంటాం. ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. రెండు రాష్ట్రాలకు చెందిన 1,100 మంది ఉన్నట్లు సమాచారం. అందుబాటు లో ఉన్నవారు 700 మంది తెలుగువాళ్లు. 350 మంది ఏపీకి చెందినవాళ్లు , చాలా మంది వైద్య విద్యార్థులే. ఒక్క విశ్వ విద్యాలయంలోనే 90 శాతం మంది వైద్య విద్యార్థులు.

LEAVE A RESPONSE