పౌర హక్కుల్నీ హరిస్తూ నయా హిట్లర్‌లా వ్యవహరిస్తున్న జగన్
బీసీల నేతని హింసిస్తున్న జగన్ రెడ్డికి బుద్ధి చెబుతామన్న వర్ల కుమార్ రాజా..
పౌరుల హక్కులకు ఏమాత్రం రక్షణ లేని రాష్ట్రంగా ఏపీని జగన్ రెడ్డి తయారు చేశాడు. చంద్రబాబుకు మద్దతుగా సైకిల్ ర్యాలీ చేపట్టిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్రను హౌస్ అరెస్ట్ అని కొంత సేపు నిర్బంధించి, తర్వాత పోలీస్ జీపులో ఎక్కించుకుని ఎక్కడెక్కడో తిప్పుతున్నారు. ప్రజల ప్రాథమిక హక్కుల్ని కూడా హరించేలా జగన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని పామర్రు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ వర్ల కుమార్ రాజా ద్వజమెత్తారు.
ఇంత రాక్షసత్వం నాటి నాజీ పాలనలో కూడా ప్రజలు చూసి ఉండరన్నారు. కొల్లు రవీంద్రకు ఏం జరిగినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ప్రభుత్వమే బాద్యత వహించాలన్నారు. బీసీల జోలికొస్తే.. జగన్ రెడ్డి నియంత పాలన భస్మం కావడం తధ్యమని హెచ్చరించిన పామర్రు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ వర్ల కుమార్ రాజా