Suryaa.co.in

Andhra Pradesh

కోర్టు ధిక్కరణ కేసులో కర్నూలు త్రీ టౌన్ సీఐకు అరెస్ట్ వారెంట్

కర్నూలు: కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన కర్నూలు త్రీటౌన్ సీఐ తాబ్రేజ్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ కర్నూలు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి టి.కేశవ ఆదేశాలిచ్చారు.వివరాల్లోకి వెళితే…అర్జీదారు బి.నరసింహస్వామి ని దౌర్జన్యంగా త్రీటౌన్ పోలీస్ వారి ప్రోద్బలంతో ఇంటి యజమానులు బిలక్ష్మీదేవి, బి.బ్రహ్మేశ్వర రెడ్డిలు ఇల్లు ఖాళీ చేయించారు.

కోర్టులో తనకు రావాల్సిన అద్దె బయానకు (అడ్వాన్స్) కొరకు అర్జీదారు కోర్టులో కేసు దాఖలు చేశారు.దౌర్జన్యంగా ఇంటిని ఖాళీ చేయించిన కర్నూల్ త్రీటౌన్ పోలీస్ వారిని సంజాయిషీ ఇవ్వమని కోర్టు ఆదేశాలిచ్చింది.

కానీ పోలీస్ స్టేషన్ నుంచి ఎవరు కూడా సంజాయిషీ ఇవ్వలేదు.గత సంవత్సరంలో ఇప్పటి సీఐ కోర్టులో హాజరై సాక్ష్యం ఇవ్వమని కోర్టు నుండి సమన్లు జారీ అయ్యాయి.సమన్లను బేఖాతరు చేయగా పోలీస్స్టేషన్ కు అతికించి రమ్మని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ఆ తర్వాత కూడా కర్నూలు త్రీటౌన్ సీఐ కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.అర్జీదారు తరపున న్యాయవాది ఎం.ఇంద్ర విజయరావు కేసును వాదించారు.

LEAVE A RESPONSE