– చంద్రబాబు, విజయసాయిరెడ్డి కలిసి ఉంటే ఎందుకు స్పందించలేదు?
వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే కేసులు
తల్లి, చెల్లి తేడా తెలియని గల్లి లో తిరిగే , సిల్లీ లీడర్ కొడాలి నాని
– బిజెపి మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం, బీజేపీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ
అరెస్టు విషయంలో ప్రొసీజర్ ఫాలో కాలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ట్వీట్ చేసిన విషయం గుర్తు చేశారు. కేవలం కక్షపూరిత రాజకీయ కారణాలతోనే ఆయన అరెస్ట్ చేసినట్లు కనిపిస్తోంది.వైసీపీ నాయకులు… ప్రతిపక్ష నాయకుల ను అవమానించేలా అవహేళన చేసేలా బూతులతో దూషిస్తున్నారు. చెప్పలేని విధంగా తిట్టినా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు.
వైసిపి ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపితే కేసులు పెడుతున్నారు. కొడాలి నాని గతంలో ఎవరిని పొగిడావు ఇప్పుడు ఎవరిని తిడుతున్నావ్ ఒకసారి గుర్తు చేసుకోవాలి. తారకరత్న చనిపోయినప్పుడు చంద్రబాబు, విజయసాయిరెడ్డి కలిసి ఉంటే ఎందుకు స్పందించలేదు?నీకు నచ్చిన వాళ్ళు ఏం చేసినా సమర్థిస్తావా? ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అంటే… వ్యక్తిగతంగా దూషిస్తావా? చంద్రబాబు 371 కోట్లు అంశంపై పురందరేశ్వరి ఏం మాట్లాడుతారని మీరా ప్రశ్నించేది?
బిజెపి అవినీతిని ఎక్కడ ఎవర్ని సమర్ధించడం లేదు.కానీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న తీర్ను మాత్రం ఖండిస్తున్నాం. పురందేశ్వరి గురించి మాట్లాడే కొడాలి నాని ముందు నీ చరిత్ర ఏంటో తెలుసుకో. మూడు సార్లు ఎమ్మెల్యే అయిపోగానే నువ్వేదో గొప్పోడు అని ఫీల్ అయిపోతున్నావు. పురంధరేశ్వరి ఏ పదవి అలంకరించిన ఎంతో ఉన్నతంగా గౌరవంగా నిలబెట్టుకున్నారు.
ఇంగ్లీషు తెలుగు తమిళం హిందీ వంటి అనేక భాషల్లో ఆమె ప్రావీణ్యం సంపాదించారు. నీలాంటి బూతులు మంత్రి కూడా మా అధ్యక్షురాలను ప్రశ్నిస్తున్నారంటే సిగ్గుగా లేదా? మీ అవినీతి దోపిడీపై ప్రశ్నిస్తే తిడతారా? సభ్యత సంస్కారం లేకుండా నోటికి వచ్చినట్లు వాగితే తగిన బుద్ధి చెబుతాం. కొడాలి నాని.. గుర్తుపెట్టుకో . పిచ్చిపిచ్చిగా ఇంకోసారి వాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడితే మంచిది.
కొడాలి నాని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎలా వచ్చావు? నీ కేసులు నీ అవినీతి గురించి మాకు తెలుసు. ఇంకోసారి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బీజేపీ నాయకులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
తల్లి, చెల్లి తేడా తెలియని గల్లిలో తిరిగే , సిల్లీ లీడర్ కొడాలి నాని: షేక్ బాజీ… బీజేపీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు
ఎన్టీఆర్ కుమార్తెగా దగ్గుబాటి పురందేశ్వరి మంచి పేరు సంపాదించారు.విద్య లేని వాడు వింత పశువు అనే నానుడికి కొడాలి నాని అక్షరాల సరిపోతాడు.ఓట్లు వేసిన తల్లిదండ్రులు, వారి పిల్లల చదువులను నాశనం చేసిన వ్యక్తి.సభ్యత మరచి మా అధ్యక్షురాలిని దూషించడం కొడాలి నాని మూర్ఖత్వానికి పరాకాష్ట.
ఓటమి భయంతో కొడాలి నాని పిచ్చి పట్టి నోటికి వచ్చినట్టు కూస్తున్నాడు. ప్రజలకు మేలు చేయమని గెలిపిస్తే బూతుల మంత్రిగా నాని పేరు సంపాదించాడు. వైసీపీని ఎందుకు గెలిపించామా అని ప్రజలు తలలు పట్టుకుని బాధపడుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొడదామా అని ఎదురుచూస్తున్నారు.భవిష్యత్తులో కొడాలి నాని కి తగిన విధంగా బుద్ధి చెప్పి సభ్యత సంస్కారం నేర్పిస్తాం. ప్రజలు కూడా ఇటువంటి అనాగరిక వ్యక్తులను ఓడించి తరిమికొట్టాలి.