– భారత రాష్ట్ర సమితి విద్యార్ధి నేత డా. ఎర్రోళ్ళ శ్రీనివాస్
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో బిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకుల ఆరెస్టు లను ఖండిస్తున్నా. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్రమంగా గోదావరి జలాలను బనకచర్ల కు తరలించుకు పోతున్న విషయాన్ని విద్యార్థులకు చెబుతున్న సందర్భంగా , పోలీసులు విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టు చేయాడం దుర్మార్గమైన చర్య. చంద్ర బాబు గోదావరి జలాలను అక్రమంగా ఆంధ్రాకు తరలించుకుపోతుంటే అడ్డుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం,మా నాయకుల అడ్డుకోవడం, అరెస్ట్ చేసి కేసులు పెట్టడం చాలా బాధాకరం.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణా ప్రజల మనోభావాలను ఆంధ్ర బాబు కళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడాన్ని , భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తూంది . అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయ్యాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కి చిత్త శుద్ధి ఉంటే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి బనక చర్ల ప్రాజెక్టు కు వ్యతిరేకంగా పోరాటం చేయాలి.