విజయవాడ: బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో ఈనెల 13వ తేదీన మొట్టమొదటి సారిగా విజయవాడ రాష్ట్ర కార్యాలయానికి దగ్గుబాటి పురందేశ్వరి రానున్నారు. ఈ సందర్భంగా భారీ స్వాగత ఏర్పాట్లు చేయాలని బిజెపి భావిస్తోంది. ఈ మేరకు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ రాజు ప్రకటించారు.
గన్నవరం ఎయిర్ పోర్టు నుండి విజయవాడ బిజెపి రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.గన్నవరం ఎయిర్ పోర్టు నుండి విజయవాడ వరకు రహదారి పొడవునా బిజెపి పతాకాలు ,ఫ్లెక్సీలతో అలంకరణ చేయనున్నామని సూర్యనారాయణ రాజు పేర్కొన్నారు.
బిజెపి శ్రేణులు, బిజెపి అనుబంధ సంఘాలు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని పురందేశ్వరికి స్వాగతం పలికి ఆమె వెంట బిజెపి రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు .బిజెపి రాష్ట్ర నేతలతో పాటు బిజెపి అభిమానులు కోలాహలం మధ్య అదే రోజు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి భాద్యతలను స్వీకరిస్తారని వేటుకూరి సూర్యనారాయణ రాజు పేర్కొన్నారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు గా బాధ్యత లు స్వీకరించి న తరువాత వెన్యూ ఫంక్షన్ హాలు లో నిర్వహించే బిజెపి కార్యకర్తలు సమావేశం లో దగ్గుబాటి పురంధేశ్వరి గారు అధ్యక్షురాలు హోదాలో తొలి ప్రసంగం చేయనున్నారు.