Suryaa.co.in

Entertainment

మే దుష్మన్ తో నహీ..!

మెషాయర్ తో నహీ..
మగర్ ఏ హాసీ..
జబ్ సే దేఖా..
మైనే తుజ్ కో
ముజ్ కో..
షాయరీ ఈ ఆగయా…

ఈ పాటలో అద్భుతంగా అభినయించిన రిషికపూర్
చల్గయా..
అప్పట్లో ఆ పిల్లోడి కంటే
పెద్దదైన పూబోణి..
అరుణా ఇరానీ..
డెబ్బై నాటౌట్..!
ఇప్పటికీ కుర్రకారు
ఆమె కోసం లుకౌట్..!!

ఆమె నర్తిస్తే..
చప్పట్లు వర్షించాయి..
ఆ ముఖ కవళికలు..
రస గుళికలు..
బాబీలో పొడుగు గౌను పాపగా
రిషిని ఆకట్టుకునే ప్రయత్నం
ఏనాడూ చీరకట్టు లేని
నాట్యరత్నం..
అలా చిందులేసి..
ఎదిగి అమ్మ పాత్రల్లో ఒదిగి
ఇప్పటికీ నటిగా..
తనకు తానే సాటిగా..!

ఇరానీ జత కడితే
మెహ్మూద్ తో
అబ్బో..నవ్వుల జల్లు..
అదో పరంపర..
కొన్ని సినిమాల్లో నాయిక..
బాంబే టు గోవా
ఈ సినిమాలో బచ్చన్ తో
జత కట్టిన పాలకోవా..
మొత్తానికి ఈ ఇరానీ..
డెబ్బై దాటినా జవానీ…!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE