అరుణాచలేశ్వరుని దర్శనానికి వెళ్తున్నారా ? ఆ క్షేత్రం లో ప్రవేశించిన క్షణం నుండి …తిరిగి వచ్చేవరకు …. వీలైనంత వరకు ఇక్కడ పేర్కొనబడిన విషయాలు పాటించడానికి ప్రయత్నించండి ! ఈ పోస్ట్ ను మీ ఫ్రెండ్స్ అందరకీ షేర్ చెయ్యండి !ఓం అరుణాచలేశ్వరాయనమః
శివుని అనుమతి లేనిదే ప్రవేశం దొరకని క్షేత్రం “అరుణాచలం”-
- ఒక్క సారి అరుణాచలంలో ప్రవేశించిన తర్వాత … మౌనం పాటించండి (మాట్లాడితే మనసు శివుని మీద ఉండదు )
- శివ నమ స్మరణ చేస్తూనే వుండండి (లేదంటే మన నాలుకకు హద్దు ఉండదు )
- వీలైనంత వరకు మితాహారం పాటించండి (లేదంటే స్పృహ శివుని మీద ఉండదు )
- సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యండి (లేదంటే మనం మనతోనే ఉండలేము … అక్కడ శివునితో ఉండాలి )
- మన దర్పం చూపకూడదు (అక్కడ శివుడే సుప్రీమ్ … మనము జీరో )
- దంపతులైన సరే దాంపత్య జీవితం అక్కడ గడపకూడదు (కోరికలు దగ్ధం చేసే అరుణాచలంలో …. కోరికలను తీర్చుకోకూడదు )
- వీలైతే అన్నదానం చేయండి (మోక్షానికి దగ్గరవుతారు. అది కూడా మోక్షం కావాలనుకునే వారు మాత్రమే )
- ఎవ్వరిని దూషించకండి (అక్కడ శివ పార్వతులు సిద్ధుల రూపంలో … సాధారణ రూపంలో మన మధ్యలోనే వుంటారు )
- తప్పదు కాబట్టి .. మీ హోటల్ రూమ్ లో తప్ప … అరుణాచల క్షేత్రంలో ఎక్కడా.. ఉమ్మి వెయ్యకండి, మూత్ర మల విసర్జన చెయ్యకండి
అరుణాచలం సాక్షాత్తూ శివుడు ప్రత్యక్షంగా సంచరించే గొప్ప క్షేత్రం.. ఆయనకు అసౌకర్యం కలిగించేందుకు, మనం అరుణాచలం వెళ్లాల్సిన అవసరం ఉందంటారా ?
సాధారణ పుణ్య క్షేత్రంలా …. కేవలం దర్శనం నిమిత్తం అరుణాచలం రావద్దు. ఇది పరమ పావన ఆవిర్భావ అగ్ని లింగ క్షేత్రం …. మనసా వాచా కర్మణానా శివ స్పృహ తో చేసే యాత్ర … అరుణాచల యాత్ర ! ఒక్క సారి అర్హతతో కూడిన అరుణాచల దర్శనం చెయ్యగలిగితే … ఇక మరొక జన్మ ఉండదు !
అయ్యా బాబోయ్ … మాకు మళ్ళీ జన్మ కావాలి … మానవ సుఖాలన్నీ అనుభవించాలి అనుకుంటే …. మీ ఇష్టం వచ్చినట్లు దర్శనం చేసుకోవచ్చు … అరుణాచల శివుని … ఎందుకంటే అది కేవలం దర్శనం మాత్రమే అవుతుంది.మన మరు జన్మలకు అడ్డం ఉండదు !
అరుణాచలం లో ఉన్నంత సేపు మరియు గిరి ప్రదక్షిణ లో అను క్షణం అందరూ గిరి వైపు చూస్తూ శివ నమ స్మరణ చేస్తూనే ఉండాలి. అది కేవలం కొండ కాదు. ఆ కొండ కొండ మొత్తం యోగ నిద్ర లో శ్రీ మేధా దక్షిణామూర్తి స్వరూపం.
– సువర్చల