-ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్యుసదుపాయల కల్పన వల్లే పెరుగుదల
-గత ఏడాది ఆరోగ్య శ్రీ కింద 826 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం
-ఆర్థోపెడిక్ కేసులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలి
-ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్త్ అమలులో తెలంగాణ ఆయుష్మాన్ ఉత్క్రిష్టత పుర పురస్కారం పొందడం పట్ల అభినందనలు
-ఆరోగ్య శ్రీపై దృశ్యమాధ్యం ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించిన వై ద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
-వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ వైద్య సేవలు 34 శాతం నుండి 53 శాతానికి పెరిగాయి.2020-21 సంవత్సరంలో 34 శాతం అంటే 88,467 సర్జరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగాయి.2021-22లో ఆరోగ్య శ్రీ సర్జరీలు 43 ( 1,52,096 సర్జరీలు) శాతానికి పెంచగలిగాం.ఈ ఏడాది ఆగష్టు 31 నాటికే 1,14,681 సర్జరీలు (53 శాతం) జరిగాయి. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2020-21 లో 34 శాతం ఉన్నఆరోగ్య శ్రీ సర్జరీలు ఉంటే, దాన్ని 53 శాతంకు పెంచగలిగాం.
రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం, ఎం.ఆర్. ఐ స్కాన్ , సిటీ స్కాన్, క్యాథ్ ల్యాబ్ వంటి ఆధునిక సదుపాయాలు కల్పించడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు , సర్జరీలు 34 నుండి 53 శాతానికి అంటే 18 శాతం పెరిగింది. సీహెచ్ సీలు, పీహెచ్ సీలలో కూడా ఆరోగ్య శ్రీ సేవలు అందించడం వల్ల ప్రభుత్వ రంగంలో ఆరోగ్య శ్రీ సేవలు, సర్జరీలు పెరిగాయి. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మినహా మిగతా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అధికంగా ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయి.
కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎందుకు ఆరోగ్య శ్రీ సేవలు , సర్జరీలు తగ్గాయే సమీక్ష నిర్వహించాలని ఆదేశం. మిగతా జిల్లాల్లో ఆరోగ్య శ్రీ సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుకుంటే ఈ మూడు జిల్లాల్లో వెనకబడటానికి కారణాలు అన్వేషించాలి. ఆరోగ్య శ్రీ కింద సర్జరీలు చేసిన తర్వాత పేషంట్ల ఆరోగ్య పరిస్థితిని ఆరోగ్య మిత్రలతో పాటు ఆరోగ్య శ్రీ సిబ్బంది ఎప్పటికప్పుడు తెలుకుని సలహాలు- సూచనలు ఇవ్వాలి. ఏదైనా ఆరోగ్యంలో తేడా వస్తే వెంటనే ఆసుపత్రులకు తరలించేలా చర్యలు చేపట్టాలి.
పేషంట్లను డిచ్చార్జ్ చేసేటప్పుడు మందులు ఇస్తున్నదీ లేనిదీ ఆరోగ్య శ్రీ సిబ్బంది పరిశీలించాలి. సక్రమంగా అవసరమైన మందులు రోగికి అందేలా చూడాలి.ఆర్థోపెడిక్ కేసులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువ జరిగేలా చూడాలని ఆదేశం. లాంగ్ బోన్ ఫ్యాక్చర్ చికిత్సలు జిల్లాలో ఎక్కువ జరిగేలా చర్యలు చేపట్టాలి. కొన్ని ప్రయివేటు ఆసుపత్రుల్లో ఎక్కువ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందుకు గల కారణాలు పరిశీలించాలని ఆదేశం.
ఆరోగ్య మిత్రలు, జిల్లా సమన్వయకర్తలు, టీం లీడర్ల పని తీరు బాగా ఉండాలి. బాగా పని చేసే వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. పని చేయకపోతే చర్యలుంటాయి.ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 90 లక్షల పేద కుటుంబాలు ఉచిత వైద్య సేవలు పొందవచ్చు.2014 నుండి ఇప్పటివరకు 11 లక్షల మందికి ఆరోగ్య శ్రీ సేవలు అందాయి. ఇందు కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు 5,600 కోట్లు ఖర్చు చేసింది.
గత ఏడాది ఆరోగ్య శ్రీ పథకం కింద ప్రభుత్వం 826 కోట్లు ఖర్చు చేసి పేదల ప్రజకు ఉచిత వైద్య సేవలు అందించింది.ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్త్ అమలులో తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా నిలిచి అందుకు గాను ఆరోగ్య మంథన్ 2022 కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఆయుష్మాన్ ఉత్క్రిష్టత పుర పురస్కారం ( AYUSHMAN UTKRISHTATA PURASKAR 2022) అందజేసింది. దీని పట్ల ఆరోగ్య , వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపిన మంత్రి. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఆరోగ్య శ్రీ సీఈవో విశాలాచ్చి, ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయ కర్తలు, టీం లీడర్లు పాల్గొన్నారు.