Suryaa.co.in

Andhra Pradesh

ఆడబిడ్డ తల్లిగా నన్ను భయాందోళనకు గురిచేసింది

– ఏపీసీసీ చీఫ్‌ షర్మిల

విజయవాడ: గుడ్లవల్లేరు ఘటన తనను తీవ్ర భయాందోళనకు గురిచేసిందని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే నిదర్శనమని విమర్శించారు. ఫాస్ట్రాక్ విచారణ జరిపి మరోసారి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాలంటే భయపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాత్రూమ్ వీడియోలు బ్లాక్ చేయాలన్నారు. విద్యార్థినుల పక్షాన పోరాటం చేస్తామన్నారు.

LEAVE A RESPONSE