కమిషన్ – కమిటీ.. తెలంగాణ చట్టం – ఎస్సీ వర్గీకరణ చట్టబద్దత….
తెలంగాణ ఉద్యమం ఉదృతంగా జరుగుతున్న సందర్బంలో కేంద్ర ప్రభుత్వం శ్రీ కృష్ణ కమిషన్ నియమించింది.
తెలంగాణ ఇవ్వడానికి సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం చట్టానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన కోసం సుశీల్ కుమార్ షిండే గారి నేతృత్వంలో జైరాం రమేశ్ గారు మరియు మరికొంత మంది సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేసింది.ఆ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలతో తెలంగాణ చట్టం రూపొందించబడింది.. ఆ చట్టమే పార్లమెంట్ లో ఆమోదించబడింది.తెలంగాణ ఏర్పడింది.
అలాగే ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఉషా మెహ్రా కమిషన్ వేసింది. కమిషన్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చింది.ఇప్పుడూ ఎస్సీ వర్గీకరణ చట్టబద్దతకు సంబందించిన మార్గదర్శకాలను రూపొందించడానికి కమిటీ అవసరం.. నిన్న విశ్వరుప సభలో నరేంద్ర మోడి గారు వేస్తామన్న కమిటీ ఎస్సీ వర్గీకరణ చట్టబద్దత పక్రియపై మార్గదర్శకాలు రూపొందించడానికే కానీ మాదిగలకు అన్యాయం జరిగిందా లేదా తేల్చడానికి కమిషన్ వేయడం కాదు.
ప్రధాని ప్రసంగంలో ఎస్సీ వర్గీకరణకు సంబందించి సుప్రీం కోర్టులో ఉందని, ఎస్సీ వర్గీకరణ చేయడానికీ కట్టుబడి ఉన్నామని,అందుకోసం కమిటీ వేస్తామని అన్నారు.ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అంశం.
కమిషన్ – సమస్యను అధ్యయనం చేయడానికి…
కమిటీ – సమస్యను పరిష్కారం చేయడానికి..
శ్రీకృష్ణ కమిషన్ – తెలంగాణ సమస్య అధ్యయనం కోసం..
షిండే కమిటీ – తెలంగాణ సమస్య పరిష్కారం కోసం..
ఉషామెహ్రా కమిషన్ -వర్గీకరణ సమస్య అధ్యయనం కోసం..
మోడి వేసే కమిటీ – వర్గీకరణ సమస్య పరిష్కారం కోసం ..
ఈ వత్యాసాలను అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి.
ఇప్పటికే ఒకసారి తెలుగు నేల మీద ఎస్సీ వర్గీకరణ చట్టబద్దత అయిన తీరును పరిశీలించాలి.
TDP ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ సమస్య అధ్యయనం కోసం జస్టీస్ రాంచంద్ర రాజు కమిషన్ నియమించింది.
ఆ తరువాత ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం కోసం అశోక్ గజపతి రాజు గారి అధ్వర్యంలో కమిటీ వేసింది.
ఆ కమిటి సిఫారసులతో అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చట్టం ఆమోదించబడింది..అదే అమలులోకి వచ్చింది..
రామచంద్ర రాజు కమిషన్ – అధ్యయనం కోసం
అశోక్ గజపతి కమిటీ – సమస్య పరిష్కారం కోసం..
ఇలా ఎస్సీ వర్గీకరణ అమలు జరిగింది.
కర్ణాటకలో సదాశివ కమిషన్ ఎస్సీ వర్గీకరణ అధ్యయనం కోసం నియమించబడింది.
ఆ తరువాత మదుస్వామి కమిటీ నియామకం జరిగింది.
ఆ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలతో ఎస్సీ వర్గీకరణ మీద క్యాబినేట్ లో తీర్మానం జరిగింది.
చాలా సమస్యల అధ్యయనం కోసం కమిషన్ ఏర్పాటు చేయడం, అలాగే సమస్యల పరిష్కారం కోసం కమిటీలు ఏర్పాటు చేయడం సహజమైన ప్రక్రియ…
దీనిలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు….
మాదిగ ప్రజలు అయోమయానికి గురి కావాల్సిన అవసరం లేదు….
ప్రధానమంత్రితో పది సార్లు మాదిగ అనే పేరు పలికించి మన జాతి ఆత్మగౌరవాన్ని , అస్థిత్వాన్ని ప్రపంచానికీ చాటి చెప్పాం…
అందుకు గర్వపడుతూ…. ఎస్సీ వర్గీకరణ చట్టబద్దత త్వరగా పూర్తి కావాలని ముందుకు వెళ్దాం….
ప్రధానమంత్రి గారి ఉపన్యాసం మొదటి నుండి స్పష్టంగా విన్న వాళ్లకు, ఆ ప్రసంగాన్ని అనుకరించిన వాళ్ళకు విషయం స్పష్టంగా అర్థమైంది..
కొంత మందికి విశ్వరూపానికి లక్షలాది జనం రావడం,ప్రధానమంత్రి పాల్గొనడం, మంద కృష్ణ మాదిగ నాయకత్వాన్ని ప్రశంసించడం , తిరుగులేని శక్తిగా మాదిగ ఉద్యమం నిలబడడం జీర్ణించుకోలేకపోతున్నారు….
లక్ష్యంపై ప్రయాణించే వాళ్ళకు స్పష్టత ఉన్నది..
లక్షం చేరే మార్గంపై అవగాహన ఉన్నది…
ఏది ఏమైనా జాతి గెలువబోతుందని అనేది నిజం.