Suryaa.co.in

Andhra Pradesh

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై ఆషాడమాసం ఉత్సవాలు

ఇంద్రకీలాద్రిపై నేటి నుండి ఘనంగా ఆషాడమాసం ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. మేళ తాళాలతో ,మంగళవాయిద్యాలతో ,కోలాటాలతో అంగరంగ వైభవంగా అమ్మవారికి సారెను సమర్పించారు ఆలయ అర్చకులు. కనకదుర్గ నగర్ లోని గోశాల వద్దనుండి అమ్మవారికి సారె ను తీసుకువచ్చిన ఆలయ అర్చకులు…ప్రతి ఏడాది ఆషాఢమాసంలో వచ్చే వారాహీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి సారె సమరపిస్తారు.

అమ్మ వారికి సారెను సమర్పిస్తే వర్షాలు బాగా పడి పాడి పంటలు, పండి దేశం సస్యశ్యామలంగా ఉంటుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అన్న మాట. అమ్మవారిని మన ఇంటి ఆడపిల్ల గా భావించి ఆషాడమాసంలో పసుపు, కుంకుమ, చీర జాకెట్, చలివిడి ని పెడతారు భక్తులు..ఆషాడం సారెను సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది.

ఆషాడ మాసం నెలరోజుల పాటు సారెను సమర్పించే భక్తులు మూడు రోజులు ముందుగానే నమోదు చేసుకోవాలని సూచించారు ఆలయ అధికారులు. జులై 28వ తేదీ వరకు ఆషాడమాసం సారె ఉండనుంది. ఎంత మంది భక్తులుతో వచ్చి అమ్మవారికి సారెను సమర్పిస్తారో ముందుగానే తెలియజేయాలని సూచించారు ఆలయ అధికారులు.

LEAVE A RESPONSE