• చట్టాలను కాపాడి, ప్రజలకు అండగా నిలవాల్సిన సివిల్ సర్వీస్అధికారులే పాలకుల అడుగులకు మడుగులొత్తబట్టే, రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యాయి.
• చంద్రబాబుహయాంలో తలబిరుసుగా మాట్లాడిన ఐఏఎస్ లంతా ఇప్పుడు అయ్యాఎస్ అంటూ ఎందుకు తలదించుకుంటున్నారు?
– టీడీపీ కేంద్రకార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు
నిన్న రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలతో ఈరోజు ఫూల్స్ డే అని చాలామంది మర్చిపోయారని, న్యాయంఅమలుచేసేక్రమంలో ఒకేసారి రాష్ట్రానికిచెందిన 8మంది ఐఏఎస్ అధికారులకు న్యాయస్థానం శిక్షలు వేయడమనేది బహుశా దేశచరిత్రలోకూడా ఇదేతొలిసారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అభిప్రాయపడ్డారు.శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు,ఎమ్మెల్యేలు, అధికారులు కోర్టులతో చీవాట్లుతినడం, ఆఖరికి శిక్షలువేయించుకునేవరకువెళ్లడం నిజం గా ఏపీకి సిగ్గుచేటు. నిన్నటికి జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలనుశిక్షిస్తే, ఆయన అనాలోచితచర్యల్లో పాలుపంచు కుంటూ ప్రజలను వేధిస్తున్నఐఏఎస్ అధికారులనున్యాయస్థానం శిక్షించడంజరిగింది.
కోర్టుచేత శిక్షించబడిన వారంతా సీనియర్ ఐఏఎస్ అధికారులే. వారేమీకొత్తగా నిన్నో…మొన్నో సర్వీసుల్లోకి వచ్చినవారుకాదు. ఈ ప్రభుత్వంలో నిర్మిస్తున్నసచివాలయాలు, రైతుభరోసాకేంద్రాలు.. ఇతరత్రా పనికిమాలిన భవనాలను ప్రభుత్వపాఠశాలలు, హైస్కూళ్లకుచెందిన స్థలాల్లో నిర్మించకూడదనేది ఎప్పటినుంచో ఉంది. దానికి విరుద్ధంగా రాష్ట్రంలో అనేకచోట్ల ఈప్రభుత్వం వివిధ భవనాలునిర్మించింది.
ఎప్పుడో 1920లోనే ఆవిధమైన నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదంటూ న్యాయస్థానాలు స్పష్టంచేసి నాకూడా ఈప్రభుత్వం తనకుతోచిన విధంగా వ్యవహరించింది. దానిపై ఏపీ హైకోర్ట్ ప్రభుత్వానికి నోటీసులుఇస్తే స్పందనలేదు. దాంతో ఆగ్రహించిన రాష్ట్రహైకోర్ట్ 8మంది ఐఏఎస్ అధికారులను న్యాయస్థానానికి పిలిచి దండించింది. దాంతో వారు న్యాయమూర్తు లను క్షమాపణకోరగా సంక్షేమహాస్టళ్లలో సేవలందించాలని ఆదేశిం చింది.
ఇదంతా గమనిస్తే అసలు ఈప్రభుత్వంలో అధికారులు, యంత్రాం గంఎందుకిలాతయారైందన్నదే అందరిసందేహం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీలుగా పనిచేసినవారు…డీజీపీలు అందరూ న్యాయస్థానాల్లో చేతులు కట్టుకుని నిలబడినవారే.
గతంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుగారిని విశాఖ విమానాశ్రయంలో అడ్డగించినప్పుడు, సదరు ఘటనపై అప్పుడు డీజీపీగా ఉన్న సవాంగ్ ను న్యాయస్థానం కోర్టులో నిలబెట్టి, ఏసెక్షన్లు దేనికి వర్తిస్తా యో చదవమని ఆదేశించింది. ఆ విధంగా గౌతమ్ సవాంగ్ 3 సార్లు హైకోర్టులో దోషిలా నిలబడ్డారు. అలానే ప్రభుత్వప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన సుబ్రహ్మణ్యం, నీలంసహానీ, సమీర్ శర్మలుకూడా కోర్టులచేతిలో చీవాట్లుతిన్నవారే.
మొన్నటికి మొన్న 8మంది ఐఏఎస్ లు క్షమాపణకోరితే, అంతకు ముందు ఇంతియాజ్…..మన్మోహన్ సింగ్ లుకూడా న్యాయస్థానం చేతిలో చీవాట్లుతిన్నారు. ఆనాడుకూడా వారు న్యాయమూర్తుల ను బతిమాలుకొని క్షమాపణచెప్పారు.
ఈ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులంతా ఎందుకిలా అయ్యాఎస్ లుగా మారారు? కొడుకు పాలనలోనే కాదు..గతంలో తండ్రిపాలన లోకూడా బీపీ.ఆచార్య, శ్రీలక్ష్మి, రాజగోపాల్,శామ్యూల్, రత్నప్రభ, మన్మోహన్ సింగ్ లాంటివారు కోర్టుల చుట్టూ తిరిగారు. వారిలోకొం దరు ఇప్పటికీ కోర్టువాయిదాలకు వెళ్తూనేఉన్నారు.
ప్రజల చేత ఎన్నుకోబడినవారికి అధికారానికి, రాజ్యాంగానికి మధ్య ఉండే వ్యత్యాసం తెలియచేయాల్సింది ఐఏఎస్ అధికారులే. రాజ్యాంగంప్రకారం నడుచుకోవాల్సిన ఐఏఎస్ అధికారులు రాజకీ యఒత్తిళ్లకు తలొగ్గితే వారుకూడా బలికాకతప్పుదు.
ఈప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులు, ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పేదానికి గంగిరెద్దుల్లా తలాడిస్తున్నారనే చెప్పాలి. ముఖ్యమం త్రి, మంత్రులు ఉండేది 5సంవత్సరాలే..కానీ ఐఏఎస్ లు, ఐపీఎస్ లు 30ఏళ్లపాటు సర్వీసులోఉంటారు. అలాంటివారు రాజ్యాంగాన్ని … చట్టాలను, న్యాయాన్నికాపాడకుండా, అధికారంలోఉన్నవారి కి ఊడిగంచేస్తేఎలా? ఐఏఎస్ అధికారి ముఖ్యమంత్రో..మంత్రోకావ చ్చు. కానీ ముఖ్యమంత్రి, మంత్రులెవరూ ఐఏఎస్ ..ఐపీఎస్ కాలేరు. ఇండియన్ సివిల్ సర్వీసెస్ గొప్పతనం అది.
చట్టాన్ని ఏరకంగా అమలుచేయాలో.. పాలకులకు చెప్పాల్సింది ఐఏఎస్ లే. మాజీఐపీఎస్ అధికారి… మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం నిన్న ఒకమాటచెప్పారు. అవినీతి అంటే ఏ అధికారి అయినా కేవలం డబ్బులు తీసుకోవడమేకాదు….తనస్వార్థం కోసం.. తనకుకావాల్సిన వాటికోసం ప్రభుత్వంవద్ద తలవంచడం కూడా అవినీతేఅన్నారు. సుబ్రహ్మణ్యం గారు చెప్పింది అందరూ ఆలోచించాల్సిన విషయం.
ఈ ప్రభుత్వం తప్పు చేస్తే తప్పుని తప్పని చెప్పాలి. అంతేగానీ ఏదో ఆశించి,లేకపోతే భయపడి పాలకులకు తలొగ్గకూడదు.ఐఏఎస్ లు వారివిధినిర్వహణప్రకారం నడుచుకోవడంలేదు కాబట్టే, ఈ రాష్ట్రంలోపనిచేస్తూ న్యాయస్థానాలముందుదోషుల్లా నిలబడాల్సి వస్తోంది. ప్రభుత్వభవనాలు, ఇతరనిర్మాణాలకు పార్టీల రంగులు వేయకూడదని, ప్రభుత్వపాఠశాలల్లో స్థలాల్లో ఇతరత్రా నిర్మాణాలు చేయకూడదని ఐఏఎస్ లకుతెలియదా? తెలిసీ ప్రభుత్వంలోని వారికి చెప్పకపోతే అదినేరంకాదా? ఐఏఎస్ పదవిని తీసేసే అధికా రం ఏ ముఖ్యమంత్రికి ఉండదుకదా!
ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు వ్యక్తిత్వంకోల్పోబట్టే, నేడురాష్ట్రం లోని వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యాయి.
ఇప్పుడు పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులే..గతంలో టీడీపీహా యాంలో ముఖ్యమంత్రిచెప్పినా చేయమంటూ తలబిరుసుగా మా ట్లాడారు. అప్పుడున్నధైర్యం ఇప్పుడేమైందని ప్రశ్నిస్తున్నాం. ఆనాడు తలబిరుసుగా మాట్లాడినవారు..నేడు అయ్యా..ఎస్ అంటూ ఎందుకు వ్యక్తిత్వాన్ని చంపుకుంటూ పనిచేస్తున్నారు? అలాంటి అధికారులతీరుతో వ్యవస్థలు మొత్తం నాశనమవతున్నా యనే ప్రజలు, ప్రజాసంఘాలు..మేథావులు ఆందోళనచేస్తున్నారు.
చంద్రబాబు బస్ మీద దుండగులు రాళ్లేసినప్పుడు, డీజీపీగా ఉన్నసవాంగ్ ప్రజాస్వామ్యంలో అలారాళ్లేసే స్వేచ్ఛ అందరికీ ఉం టుందని నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గానికి వంతపలికాడు. అదే సవాంగ్ ను ఈ ముఖ్యమంత్రి కారణంలేకుండా డీజీపీ నుంచి పీకిపారేస్తే.. అతనేంచేశాడు. ఐపీఎస్ అధికారిగా డీజీపీ ఆనాడే చట్టాన్నికాపాడిఉంటే,చరిత్రలో నిలిచిపోయేవాడు. సవాంగ్ తీరుతో ఐపీఎస్ వ్యవస్థ మొత్తం రాష్ట్రంలో నీరుగారిపోయింది.
కోర్టుచేత శిక్షింపబడిన 8మంది ఐఏఎస్ లుకూడా గతంలో చాలా అహంకారంతో మాట్లాడేవారు. వారిఅహంకారం చూపాల్సింది ప్రజలకు మంచిపాలన అందించడంలోగానీ…పాలకులు అడుగుల కు మడుగులువత్తడానికి కాదని ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది. సరిహద్దుల్లో ఉండి దేశాన్ని కాపాడుతున్న సైనికులకు.. ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు తక్కువేమీ కాదు.
వారు బోర్డర్ లో ఉండి కాపలకాస్తే… సివిల్ సర్వీస్ అధికారులు దేశంలోఉండి దేశాన్ని, ప్రజలను రక్షించాలి. వారిబాధ్యతను విస్మరించి, కంచె చేను మేసినట్టుగా ప్రవర్తిస్తే, వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు ఇకనుంచైనా వ్యవహారశైలి మార్చుకొని చట్టప్రకారం నడుచుకోవాలని ప్రజలపక్షాన నిలవాలని, ఒక ఆత్మీయుడిలా సలహాఇస్తున్నాను. కొత్తగా వచ్చే ఐపీఎస్..ఐ ఏఎస్ అధికారులుకూడా సీనియర్ల బాటలోనడిచి నగుబాట్లకు గురికాకుండా బాధ్యతాయుతంగా నడుచుకుంటే మంచిదని సూచిస్తున్నాం.